రాజశేఖర్ కూతురు కూడా శౌర్యతోనే..

రాజశేఖర్ కూతురు కూడా శౌర్యతోనే..

తెలుగు పరిశ్రమలో వారసత్వం అన్నది దశాబ్దాలుగా ఉంది. ఐతే సినీ ఫ్యామిలీల్లో అబ్బాయిలకు ఉన్నంత ప్రోత్సాహం అమ్మాయిలకు ఉండదు. దీంతో ఎంతోమంది తమ ఆశల్ని లోలోన దాచుకుని ఉండిపోయారు. ఈ విషయంలో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల కూడా కొన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఐతే గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి. మంచు లక్ష్మి, కొణిదెల నిహారిక లాంటి అమ్మాయిలు తమ చుట్టూ గీసిన హద్దుల్ని దాటుకుని బయటికి వచ్చారు. సినీ రంగ ప్రవేశం చేశారు. తమ టాలెంట్ చూపించారు. ఈ కోవలోకి మరో అమ్మాయి వస్తోంది. ఆమే శివాని.

రాజశేఖర్, జీవితల పెద్ద కూతురైన శివాని త్వరలోనే తెరంగేట్రం చేయబోతోంది. ఆమె సినిమాల్లోకి వస్తుందని ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి. ఇప్పుడా వార్తలు నిజమవుతున్నాయి. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి శివానిని కథానాయికగా పరిచయం చేస్తుండటం విశేషం. ఓ కొత్త దర్శకుడు రూపొందించే థ్రిల్లర్ మూవీలో శివాని కథానాయికగా నటిస్తుంది. ఆమెకు జోడీగా నాగశౌర్య నటిస్తుండటం విశేషం. నిహారిక కూడా నాగశౌర్యకు జోడీగానే తెరంగేట్రం చేసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. రాజశేఖర్ సినిమాలకు పూర్తిగా దూరమైపోయిన టైంలో శివాని తెరంగేట్రం చేస్తుండటం విశేషం. మరి శివాని టాలెంట్ ఏపాటిదో.. ఆమె హీరోయిన్‌గా ఏమాత్రం నిలదొక్కుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు