అవసరాల సినిమా పోతుందనుకున్నాడట

అవసరాల సినిమా పోతుందనుకున్నాడట

జ్యో అచ్యుతానంద.. ఇటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.. అటు కలెక్షన్లూ బాగున్నాయి. విమర్శకులు.. సామాన్య ప్రేక్షకులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన సినిమా ఇది. విడుదల తర్వాతే కాదు.. ముందు కూడా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఉంది. సినిమా కచ్చితంగా ఆడుతుందన్న నమ్మకం కలిగించింది ఈ సినిమా. కానీ దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌కు మాత్రం అలాంటి నమ్మకం లేదట. స్క్రిప్టు దశలో ఉన్న నమ్మకం.. సినిమా పూర్తిచేశాక లేదని.. ఎడిటింగ్ టేబుల్ దగ్గర చూసుకుంటే సినిమా పోతుందేమో అన్న భయం కలిగిందని అవసరాల చెప్పాడు.

‘‘ఈ సినిమా విషయంలో అందరూ వంద శాతం పని చేశారు. ఎవరి బాధ్యతను వాళ్లు సక్రమంగా నిర్వర్తించారు. ఏదైనా తప్పు జరిగితే రచయిత.. దర్శకుడిని నేనే కాబట్టి నా దగ్గరే జరగాలి. స్క్రిప్టు రాసినపుడు అంతా బాగుందనిపించింది. కానీ సినిమా తీశాక ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి సందేహాలు కలిగాయి. ఏదో తేడాగా అనిపించింది. రెండు నెలల పాటు ఒక రకమైన డిప్రెషన్‌తో తిరిగాను. జనాలకు ఇది నచ్చుతుందా అని సందేహం కలిగింది. అలాంటి టైంలో నిర్మాత సాయి కొర్రపాటి గారు సపోర్టిచ్చారు. ఈ రోజు ప్రేక్షకుల నుంచి ఇలాంటి స్పందన వస్తుండటం చూస్తే చాలా సంతోషంగా ఉంది.  సినిమా గురించి సమీక్షకులు స్పందించిన తీరు.. సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్ చాలా సంతృప్తినిచ్చాయి’’ అని అవసరాల చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు