ఎన్టీఆర్ చూడని రికార్డులా-కొరటాల

ఎన్టీఆర్ చూడని రికార్డులా-కొరటాల

జూనియర్ ఎన్టీఆర్‌కు ఎప్పుడూ సినిమానే ప్రపంచం అని.. తన దగ్గరికి ఎప్పుడు వెళ్లినా సినిమాల గురించి.. కథల గురించే మాట్లాడతాడని.. ముఖ్యంగా అభిమానులకు నచ్చేలా సినిమాలు చేయాలని తపిస్తాడని.. ఇలాంటి హీరోను ఇంకెక్కడా చూడలేదని కొరటాల శివ అన్నాడు. ‘జనతా గ్యారేజ్’ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ కొరటాల ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఎన్టీఆర్ అంటే ఒక ప్రత్యేకమైన ఎనర్జీ. ఆ ఎనర్జీని నేను లాక్కుంటూ ఉంటాను. జనతా గ్యారేజ్ ఇంత పెద్ద సక్సెస్ కావడంలో చాలా మంది పాత్ర ఉంది. వాళ్లందరికీ పేరు పేరునా నా థ్యాంక్స్. ఇది జనతా విజయం. అభిమానులు ఇంత అక్కున చేర్చుకోకపోతే ‘జనతా గ్యారేజ్’ ఇంత పెద్ద విజయం సాధించేది కాదు. ఈ సినిమా మాది కాదు. అభిమానులది. మా కంటే ఎక్కువగా అభిమానుల తమ సినిమా అనుకున్నారు. అభిమానులే ఎన్టీఆర్ బలం. ఎన్టీఆర్ మా బలం.

ఎన్టీఆర్‌కు రికార్డులు కొత్తేం కాదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ‘ఆది’.. ‘సింహాద్రి’ లాంటి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు దక్కిన పెద్ద సక్సెస్‌లో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఏమాత్రం ఖాళీ దొరికినా ఎన్టీఆర్ దగ్గరికే వెళ్తాను. తనతోనే మాట్లాడతాను. ఎప్పుడు వెళ్లినా కథల గురించి, సినిమాల గురించే మాట్లాడుతుంటాడు. అభిమానులకు నచ్చేలా ఏదో చేయాలంటూ ఉంటాడు. అలా తపించే హీరో ఎన్టీఆర్ ఒక్కడే. అతను టెంపర్ నుంచి రూట్ మార్చారు. మీకు నచ్చుతుందని కొత్తగా ట్రై చేస్తుంటాడు. అభిమానుల బలం ఇలాగే ఉండాలి. కొత్తవి చేస్తే ఇలాగే ప్రోత్సహించాలి. అప్పుడు మరిన్ని ‘జనతా గ్యారేజ్’లు వస్తాయి’’ అని కొరటాల అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు