రామ్ సినిమా ఆగిపోయిందా?

రామ్ సినిమా ఆగిపోయిందా?

‘నేను శైలజ’తో ఫామ్‌లోకి వచ్చాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. దీని తర్వాత ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘హైపర్’ చేస్తున్న రామ్.. ఆపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిటైన సంగతి తెలిసిందే. ఇందులో రామ్ అంధుడిగా నడించబోతాడన్న వార్త సంచలనం రేపింది. ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయిందట. రెమ్యూనరేషన్ గొడవే దీనికి కారణం అంటున్నారు. ‘నేను శైలజ’ రూ.20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన నేపథ్యంలో తన డిమాండ్ బాగా పెరిగిందని భావిస్తున్న రామ్.. ఈ చిత్రానికి రూ.5 కోట్లకు పైనే పారితోషకం అడిగాడట.

ఐతే దిల్ రాజు అంత పారితోషకం ఇవ్వడానికి ససేమిరా అనడంతో సినిమా ఆగిపోయినట్లు చెబుతున్నారు. ఇంతకుముందు రాజు-రామ్ కాంబినేషన్లో ‘రామరామ కృష్ణ కృష్ణ’ వచ్చింది. అది ఫ్లాప్ అయి రాజు నష్టాలు మూటగట్టుకున్నాడు. రాజు ముందు నుంచి బడ్జెట్ విషయంలో చాలా స్ట్రిక్ట్. రెమ్యూనరేషన్ల విషయంలోనూ అంతే. కొన్ని నెలల కిందట రవితేజతో ముహూర్తం కూడా జరుపుకున్న సినిమాను ఆపేయడానికి కూడా రెమ్యూనరేషన్ గొడవే కారణం. రామ్ కూడా రవితేజ లాగే పట్టుబడటంతో సినిమా ఆపేయాలని నిర్ణయించుకున్నాడట రాజు. రామ్ తగ్గాలి లేదా.. అనిల్ పాత్రకు తగ్గ మరో హీరో దొరకాలి. అప్పుడే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English