‘సాహసం’ షూటింగ్ ఇంకా అవ్వలేదు

‘సాహసం’ షూటింగ్ ఇంకా అవ్వలేదు

‘సాహసం శ్వాసగా సాగిపో’ ఏడాది కిందటే రావాల్సిన సినిమా. రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. జూన్లో ఆడియో విడుదల సందర్భంగా జులైలో సినిమా పక్కా అన్నారు. ఆ తర్వాత మూణ్నాలుగు డేట్లు మారిపోయాయి. సెప్టెంబరు కూడా సగం అయిపోవస్తోంది. ఇప్పటిదాకా రిలీజ్ సంగతి తేలలేదు. సినిమా ఎప్పుడో పూర్తయిపోయిందని.. వేరే కారణాల వల్ల వాయిదా పడుతోందని అంతా అనుకుంటూ వచ్చారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం విశేషం. ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఈ సినిమా తమిళ వెర్షన్ కోసం ఓ పాట తీస్తుండటం విశేషం.

తెలుగులో ‘వెళ్లిపోమాకే’కు తమిళ వెర్షన్ అయిన.. ‘తల్లిపోగాదే..’ పాటను బ్యాంకాక్‌లో శింబు, మాంజిమా మోహన్‌ల మీద చిత్రీకరిస్తున్నాడట గౌతమ్ మీనన్. ఏవో ఆర్థిక కారణాల వల్లే సినిమా వాయిదా పడుతోందన్నది అవాస్తవమని.. శింబు పుణ్యమే ఈ ఆలస్యం అని మరోసారి రుజువైంది.

‘సాహసం’ సంగతి తేలితే కానీ.. ‘ప్రేమమ్’ రిలీజ్ చేయొద్దని ఆ చిత్ర నిర్మాతలకు షరతు పెట్టిన చైతూ కూడా ఈ మధ్య ఫ్రస్టేట్ అయిపోయాడు. ‘ప్రేమమ్’ను దసరాకు రిలీజ్ చేసుకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘సాహసం..’ సెప్టెంబరు మూడో వారంలో వస్తుందన్న అంచనా కూడా తప్పేనని తేలిపోయింది. ఇక అక్టోబరు ద్వితీయార్ధంలో ఏదైనా డేట్ చేసుకుంటే బెటరేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English