నిర్మలా కాన్వెంట్‌.. వారసుల రాజ్యం..

నిర్మలా కాన్వెంట్‌.. వారసుల రాజ్యం..

ఇండస్ట్రీలో వారసులు ఉన్నారని తెలుసు గానీ.. మరీ ఇంత మంది సిద్ధంగా ఉన్నారని మాత్రం తెలియదు. నమ్మకపోతే నిర్మలా కాన్వెంట్‌ ను చూసేయండి. అందులో ఒకరిద్దరు కాదు.. ఏకంగా అరడజన్‌ మంది వారసులు ఇంట్రడ్యూస్‌ అవుతున్నారు. ముందుగా హీరో విషయానికొస్తే శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌. రుద్రమదేవిలోనే కాసేపు కనిపించిన రోషన్‌.. ఇప్పుడు సోలో హీరోగా వచ్చేస్తున్నాడు. టీనేజ్‌ లవ్‌ స్టోరీ అంటూ ఏకంగా నాగార్జునే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రోషన్‌ వెనక కొండంత అండగా నిలిచాడు నాగార్జున.

ఇక ఇదే సినిమాతో కోటి తనయుడు రోషన్‌ సాలూరి పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా మారాడు. అంతేకాదు.. తొలి సినిమాలోనే నాగార్జున లాంటి స్టార్‌ హీరోతో పాట పాడించాడు రోషన్‌. ఏఆర్‌ రెహమాన్‌ తనయుడు అమీన్‌ ఇందులో కొత్తకొత్త భాష అంటూ పాట పాడాడు. ప్రముఖ యాంకర్‌ సుమ తనయుడు రోషన్‌ కనకాల కూడా ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నాడు. హీరో ఫ్రెండ్‌ పాత్రలో నటిస్తున్నాడు రోషన్‌. ఈటీవి ప్రభాకర్‌ తనయుడు కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక చివరగా అక్కినేని నాగేశ్వరరావ్‌ తనయుడు నాగార్జున కూడా నిర్మలా కాన్వెంట్‌ తో గాయకుడిగా పరిచయం అవుతున్నాడు. మొత్తానికి ఈ సినిమా వారసుల రాజ్యంగా మారిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English