ఫ్లాప్ అని శ్రీకాంత్‌కు ముందే తెలిసినా..

ఫ్లాప్ అని శ్రీకాంత్‌కు ముందే తెలిసినా..

హీరోగా శ్రీకాంత్ హిట్టు కొట్టి చాలా కాలమవుతోంది. మంచి టాక్ వచ్చినప్పటికీ ‘టెర్రర్’ సినిమా ఆడలేదు. లేటెస్ట్ మూవీ ‘మెంటల్’ కూడా ఫ్లాపుల ఖాతాలోకి చేరిపోయింది. ఐతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఫ్లాపుల గురించి స్పందించాడు శ్రీకాంత్. ఒకప్పుడు సినిమా ఫ్లాప్ అయితే బాధపడేవాడినని.. కానీ ఇప్పుడు లైట్ తీసుకుంటున్నానని.. అలాగే కొన్ని సినిమాలు చేస్తున్నపుడు మధ్యలోనే ఫ్లాప్ అని తెలిసిపోతుందని.. కానీ కొన్ని కారణాల వల్ల సైలెంటుగా ఉండాల్సి వస్తోందని శ్రీకాంత్ చెప్పాడు.

‘‘మొదట్టో సినిమా ఫ్లాప్ అయితే చాలా బాధపడేవాడిని. ఇప్పుడు అలవాటైపోయింది. సినిమా హిట్ కావడానికి.. ఫెయిలవడానికి చాలా కారణాలుంటాయి. కొన్నిసార్లు మనకు మధ్యలోనే తెలిసిపోతుంటుంది ఈ సినిమా ఆడదని. కానీ బయటకు చెబితే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. పోనీ మనమే ఇన్వాల్వ ్ అవుదామంటే.. తేడా వస్తే మనపైనే తోసేస్తారు. సాయం చేద్దామని వెళ్లి ఇరుక్కున్న సందర్భాలెన్నో ఉన్నాయి’’ అని శ్రీకాంత్ చెప్పాడు. ఈ ఇంటర్వ్యూలో శ్రీకాంత్‌కు తోడుగా భార్య ఊహ కూడా పాల్గొంది. శ్రీకాంత్ ఫ్లాప్ సినిమాల గురించి ఆమె స్పందిస్తూ.. ‘‘ఆయనకి సగం షూటింగ్ అయ్యాక సినిమా పోతుందని డౌట్ వచ్చినా బయటకు చెప్పరు. నెగెటివ్‌గా ఉండకూడదన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటారు. అలాంటి సమయంలో ఎందుకండీ ఇలాంటి సినిమాలు చేస్తారని అంటుంటా’’ అని ఊహ తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు