అప్పుడు వెంకీని కాదన్న నిత్యానే ఇప్పుడు..

అప్పుడు వెంకీని కాదన్న నిత్యానే ఇప్పుడు..

ఇది ఐదేళ్ల ముందు సంగతి. నిత్యా మీనన్ అప్పుడే ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆ టైంలో ఆమెకు ఆఫర్లు వరుస కట్టాయి. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సరసన ఓ సినిమాకు ఆమెను హీరోయిన్‌గా అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. కానీ వెంకీకి.. తనకు ఏజ్ గ్యాప్ ఎక్కువని.. తాను ఆ సినిమా చేయనని నిత్యా ‘నో’ అన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అప్పటికే ప్రభాస్ ఎవరో తనకు తెలియదన్న నిత్యా వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవగా.. వెంకీ విషయంలో ఆమె నిర్ణయం గురించి మరింతగా చర్చ జరిగింది. నిత్య ఇంత యారొగెంట్ ఏంటి అంటూ ఆమెపైకి కామెంట్లు విసిరారు.

ఐతే వెంకీ విషయంలో అప్పుడు నిత్య నిజంగానే అలా చేసిందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడైతే ఆమె ఆ సీనియర్ హీరోతోనే సినిమా చేయబోతోంది. ‘నేను శైలజ’తో ప్రతిభ చాటుకున్న కిషోర్ తిరుమల తన తర్వాతి సినిమాను వెంకీతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో వెంకీ సరసన ఓ హీరోయిన్‌గా నిత్యానే ఫైనలైజ్ చేశారు. దీంతో అప్పట్లో వెంకీని కాదని.. ఇప్పుడు మాత్రం ఎలా ఒప్పుకుందో అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు జనాలు. ఇప్పుడు తనకు కూడా కొంచెం వయసు పెరిగింది కాబట్టి పర్వాలేదనుకుందో ఏంటో? ‘గుండె జారి గల్లంతయ్యిందే’ తర్వాత తెలుగులో సరైన సక్సెస్ లేని నిత్యకు ఇప్పుడు అర్జెంటుగా ఓ హిట్టు అవసరం. వెంకీ సినిమాతో ఆ ఆశ నెరవేరుతుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు