నారా వారబ్బాయి ఎట్టకేలకు కొట్టాడబ్బా..!

నారా వారబ్బాయి ఎట్టకేలకు కొట్టాడబ్బా..!

అందం ఉంది.. కావాల్సినంత బ్యాగ్రౌండ్‌ ఉంది.. బోలెడంత టాలెంట్‌ కూడా ఉంది.. కానీ ఇన్నాళ్లూ అద ష్టమే చిన్నచూపు నారా రోహిత్‌ ను చూసింది. ఈ హీరో నటించే సినిమాలన్నీ బాగున్నాయనే టాక్‌ వస్తాయి. కానీ ఇంత వరకు కమర్షియల్‌ గా ఒక్కటి కూడా పెద్ద సక్సెస్‌ కాలేదు. దానికి కారణం ఈయన మరీ ఆఫ్‌ బీట్‌ సినిమాలు చేయడమే. ప్రతినిథి, రౌడీఫెల్లో, అసుర లాంటి సినిమాలకైతే క్రిటిక్స్‌ అదుÄతేం అంటూ రేటింగ్‌ లు ఇచ్చారు. కానీ ఇవేవీ రోహిత్‌ కు కమర్షియల్‌ స్టార్‌ గా నిలబెట్టలేకపోయాయి.

కెరీర్‌ మొదలైన ఏడేళ్లకు రోహిత్‌ మనసు మార్చుకున్నాడు. మొన్న విడుదలైన తుంటరి, సావిత్రి, రాజా చేయి వేస్తే కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి.

ఇలాంటి టైమ్‌ లో వచ్చిన జ్యో అచ్చుతానంద రోహిత్‌ కలను నెరవేర్చేలా కనిపిస్తుంది. తొలిసారి ఇందులో ఫుల్‌ కామెడీ రోల్‌ లో అలరించాడు. క్లైమాక్స్‌ లో ఎమోషన్స్‌ కూడా బాగానే పండించాడు రోహిత్‌. ఇకపై కూడా ఇలాంటి కామెడీ ఎంటర్‌ టైనర్లు, ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్లు చేస్తే నారా రోహిత్‌ పై మంచి సినిమాల హీరో అనే ముద్ర తొలగిపోయి.. కమర్షియల్‌ స్టార్‌ అనే ముద్ర పడుతుందేమో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు