ఇంకో సూపర్‌ ఫ్లాప్‌ ఖాతాలో పడిందిగా..

ఇంకో సూపర్‌ ఫ్లాప్‌ ఖాతాలో పడిందిగా..

ఒకప్పుడు శ్రీకాంత్‌ అంటే మినిమం గ్యారెంటీ హీరో అని పేరుండేది. మిడిల్‌ క్లాస్‌ సినిమాలకు మంచి ఛాయిస్‌ లాగా ఉండేవాడు. కానీ ఆ తరహా సినిమాలు పోయాయి. అతడి డిమాండ్‌ పడిపోయింది. కానీ శ్రీకాంత్‌ హీరో వేషాలు మాత్రం వదల్లేదు. మామూలుగా ఒక హీరో వరుసగా ఫ్లాపులు కొడుతుంటే.. అతడికిది ఇన్నో ఫ్లాప్‌ అని.. అన్నో ఫ్లాప్‌ అని చెబుతుంటారు. కానీ శ్రీకాంత్‌ విషయంలో అలా లెక్కబెట్టడం మానేసి కూడా చాలా కాలమైంది. ఈ మధ్య 'టెర్రర్‌' అనే సినిమాకు మంచి పేరొచ్చింది. ఇది మంచి సినిమా అని ప్రచారం జరిగినా.. జనాలు థియేటర్లకు వెళ్లలేదు. శ్రీకాంత్‌ క్రేజ్‌ ఏ స్థాయికి పడిపోయిందో చెప్పడానికి ఇది రుజువు. అయినప్పటికీ శ్రీకాంత్‌ మాత్రం హీరోగానే కంటిన్యూఅవుతున్నాడు.

తాజాగా 'మెంటల్‌' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శ్రీకాంత్‌. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజవుతున్న సంగతి కూడా జనాలు పట్టించుకోలేదు. దీనికి తోడు సినిమాలో కంటెంట్‌ లేదట. 'టెర్రర్‌'కు ముందు వచ్చిన శ్రీకాంత్‌ చెత్త సినిమాల కోవలోకే దీన్ని కూడా చేర్చేశారు. బషీద్‌ అనే దర్శకుడు రూపొందించిన ఈ సినిమా మీద నెగెటివ్‌ రిపోర్టే వస్తోంది. బాగున్న సినిమానే జనాలు పట్టించుకోనపుడు.. ఇక దీని గురించి ఎక్కడ దృష్టిపెడతారు. కాబట్టి శ్రీకాంత్‌ ఖాతాలో మరో ఫ్లాప్‌ జమ అయినట్లే. మంచి నటుడైన శ్రీకాంత్‌ ఇకనైనా ఈ హీరో వేషాలకు స్వస్తి చెప్పేసి.. 'సరైనోడు' తరహాలో క్యారెక్టర్‌ రోల్స్‌ తో పాటు విలన్‌ పాత్రలూ చేస్తే జగపతి బాబు.. రాజేంద్ర ప్రసాద్‌ మాదిరి బిజీ అయ్యేందుకు అవకాశాలుంటాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు