నిత్యామీనన్.. వేస్టయిపోతోందిగా

నిత్యామీనన్.. వేస్టయిపోతోందిగా

సౌత్ ఇండియాలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. పాత్రలు ఎంచుకోవడంలో ఆమె టేస్టే వేరు. దిల్ రాజు ఓ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడంటే అందులో ఏదో ప్రత్యేకత ఉందని ఎలా నమ్ముతారో.. నిత్యామీనన్ ఓ పాత్ర చేసిందంటే ఆ పాత్రలో.. ఆ సినిమాలోనూ విషయం ఉంటుందని అంతే భరోసా చూపిస్తారు. ఐతే ఈ మధ్య నిత్య ఎంచుకున్న ‘ప్రత్యేక’ పాత్రలు వరుసగా తేలిపోతున్నాయి. ఆమె సినిమాలు పేలిపోతున్నాయి. తనకున్న క్రెడిబిలిటీని దెబ్బ తీస్తున్నాయి.

గత ఏడాది అల్లు అర్జున్ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో స్పెషల్ రోల్ చేసింది నిత్యా. ఆ పాత్ర ఎంత పేలవంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్య ఇలాంటి క్యారెక్టర్ చేసిందేంటా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక లేటెస్టుగా ‘జనతా గ్యారేజ్’లోనూ నిత్య క్యారెక్టర్ తేలిపోయింది. ఆ సినిమా అయితే బాగానే ఆడుతోంది కానీ.. నిత్య పాత్ర అయితే అందులో వేస్టే. ఆడియో వేడుకలో నిత్య చెప్పిన మాటలకు.. తెరమీద ఆమె పాత్రకు పొంతనే లేదు. నిన్నే విడుదలైన విక్రమ్ మూవీ ‘ఇంకొక్కడు’లోనూ నిత్య సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించింది. ఆ పాత్ర కూడా డమ్మీనే. నిత్య పోషించిన ఆరుషి పాత్ర వల్ల సినిమాకు ఎలాంటి వాల్యూ యాడ్ కాలేదు. నయనతారది మాత్రం కీలక పాత్ర. బాగా హైలైట్ అయింది. నిత్య పాత్రలో మాత్రం ఏ ప్రత్యేకతా లేదు. ఆమె టాలెంటుని దర్శకుడు ఏమాత్రం ఉపయోగించుకోలేదు. నిత్య లాంటి టాలెంటెడ్ నటి పాత్రలు వరుసగా ఇలా వేస్టయిపోతున్నాయేంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు