బాలీవుడ్లో అదిరిపోయే కాంబినేషన్

బాలీవుడ్లో అదిరిపోయే కాంబినేషన్

ఇండియాలో నిన్నటి తరం హీరోల్లో బిగ్గెస్ట్ హీరో ఎవరు అంటే మరో మాట లేకుండా అమితాబ్ బచ్చన్ పేరు చెప్పేస్తారు ఎవరైనా. ఆ తర్వాతి తరం హీరోల్లో బిగ్గెస్ట్ హీరోగా అవతరించాడు ఆమిర్ ఖాన్. వీళ్లిద్దరూ స్టార్లుగా మాత్రమే కాదు.. నటులుగానూ గొప్ప పేరే సంపాదించారు. మరి అంత గొప్ప స్టార్లు కలిసి తెరను పంచుకుంటే ఎలా ఉంటుంది..? మల్టీస్టారర్లకు ఫేమస్ అయిన బాలీవుడ్లో ఇప్పటిదాకా ఈ కాంబినేషన్ తెరమీదికి రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఎట్టకేలకు ఈ ఇద్దరు బడా స్టార్లు కలిసి నటించబోతున్నారు. వచ్చే ఏడాది దీపావళికి ఈ కలల కాంబినేషన్‌ను తెరమీద చూసుకోవచ్చు.

ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యశ్ రాజ్ ఫిలిమ్స’ అమితాబ్-ఆమిర్ కాంబినేషన్లో సినిమా నిర్మించబోతోంది. ‘ధూమ్’ సిరీస్‌తో తొలి రెండు సినిమాలకు రచయితగా పని చేసి.. మూడో భాగంతో దర్శకుడిగా మారిన విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఆమిర్ ఖాన్ సోలో హీరోగా నటిస్తేనే బాక్సాఫీస్ షేకైపోతోంది. ఇక అమితాబ్ బచ్చన్‌తో జట్టు కట్టాడంటే ఇక ప్రకంపనలు రావడం ఖాయం. ప్రస్తుతం ‘దంగల్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న ఆమిర్.. ఈ ఏడాది ఆఖర్లో ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ షూటింగ్‌లో పాల్గొంటాడు. 2018 దీపావళికి ఈ సినిమా రిలీజ్ అని ఇప్పటికే ప్రకటించేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు