దసరా సినిమాలు షాకివ్వబోతుున్నాయా..

దసరా సినిమాలు షాకివ్వబోతుున్నాయా..

విడుదల కాబోయే ప్రతి సినిమా మీదా ఒక అంచనా ఉంటుంది జనాలకు. కానీ ఆ అంచనాలు ఒక్కోసారి తప్పుతుంటాయి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న భారీ సినిమాలు బోల్తా కొట్టేస్తుంటాయి. అంతగా ఆడవనుకున్నచిన్న సినిమాలు సంచలన విజయం సాధిస్తుంటాయి. రాబోయే దసరా పండక్కి జనాలు పెట్టుకున్న అంచనాలు వేరు. ఈ పండక్కి రామ్ చరణ్ సినిమా ‘ధృవ’నే వార్తల్లో ఉంటుందని.. ఆ సినిమా చుట్టూనే చర్చంతా నడుస్తుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా అసలు రేసులోనే లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ఫోకస్ అంతా ‘ప్రేమమ్’ మీద పడింది. మలయాళ సినీ చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయిలాగా నిలిచి.. మొత్తం సౌత్ ఇండియా అంతటా ఆదరణ పొందిన సినిమాకు రీమేక్‌గా తెరెక్కడంతో ‘ప్రేమమ్’ మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు.

ఐతే రీమేక్ సినిమాలతో ఉన్న పెద్ద ఇబ్బంది.. ఒరిజినల్‌తో పోల్చి చూడటం. ఉన్నదున్నట్లు దించేస్తే జిరాక్స్ కాపీ అంటారు. మారిస్తే చెడగొట్టారు అంటారు. అందులోనూ ‘ప్రేమమ్’ లాంటి ఫీల్ ఉన్న సినిమాలను రీమేక్ చేసినపుడు ప్రతి చిన్న అంశం పట్టి పట్టి చూస్తారు ప్రేక్షకులు. ఇప్పటికే ‘ప్రేమమ్’ ప్రియులు శ్రుతి హాసన్‌ను ఆడేసుకుంటున్నారు. మరి విడుదల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ‘ప్రేమమ్’ అంచనాల్ని అందుకుని బాగా ఆడితే ఆశ్చర్యపోవాల్సిందేనేమో. దీని సంగతలా ఉంచితే.. దసరాకు రాబోతున్న మిగతా సినిమాల విషయంలో అస్సలు హైప్ లేదు. ప్రకాష్ రాజ్ ‘మనవూరి రామాయాణం’ కానీ.. తమన్నా-ప్రభుదేవాల ‘అభినేత్రి’ కానీ పెద్దగా వార్తల్లో లేవు ఇప్పటిదాకా. కానీ ఈ రెండు సినిమాలపై దర్శకులు చాలా కాన్ఫిడెంటుగా ఉన్నారు. ఇవి రెండు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు. ఇప్పుడు హైప్ లేకున్నా కంటెంట్ బాగుంటే సర్ ప్రైజ్ హిట్టయ్యే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు అల్లరి నరేష్ సినిమా ‘ఇంట్లో దయ్యం నాకేం భయ్యం’.. సునీల్ మూవీ ‘ఈడు గోల్డ్ ఎహే’ కూడా దసరా రేసులో నిలవొచ్చంటున్నారు. కానీ క్లారిటీ లేదు. మరి అవి కూడా రిలీజైతే వాటి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు