ఆ సినిమాలో నాని.. నాని సినిమాలో రాజమౌళి

ఆ సినిమాలో నాని.. నాని సినిమాలో రాజమౌళి

వారం వ్యవధిలో రాబోయే రెండు ఆసక్తికర తెలుగు సినిమాల్లో క్యామియో రోల్స్‌ గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ శుక్రవారం విడుదలయ్యే అవసరాల శ్రీనివాస్‌ కొత్త సినిమా 'జ్యో అచ్యుతానంద'లో నాని క్యామియో రోల్‌ చేశాడని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. స్వయంగా అవసరాలే ఈ విషయాన్ని కనామ్‌ే చేశాడు. తన సినిమాలో నాని ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తున్నాడని.. ఐతే ఆ పాత్ర ఏంటన్నది మాత్రం సస్పెన్స్‌ అని అవసరాల చెప్పాడు. నాని పాత్ర ఈ సినిమా చివర్లో వస్తుందని అంటున్నారు. ఆ పాత్ర చాలా థ్రిల్లింగా.. ఎంటర్టైనింగ్‌గా ఉంటుందని కూడా చెబుతున్నారు.

మరోవైపు తర్వాతి శుక్రవారం విడుదల కాబోయే నాని సినిమా 'మజ్ను' దర్శక ధీరుడు రాజమౌళి ఓ క్యామియో రోల్‌ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నాని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాని రాజమౌళి దగ్గర పని చేసే సహాయ దర్శకుడిగా కనిపిస్తాడట. ట్రైలర్లో నాని.. 'బాహుబలి'లో ఉపయోగించిన రథంలో వెళ్లే సన్నివేశం కనిపించింది కూడా. దీన్ని బట్టి నాని.. రాజమౌళి దగ్గర 'బాహుబలి'కి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నట్లు చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. నిజంగా రాజమౌళి కనిపించాడంటే 'మజ్ను'కు అది పెద్ద ప్లస్‌ అవుతుందనడంలో సందేహం లేదు.