ట్రైల‌ర్ టాక్ః నాని ఇంకోటి కొట్టేలా ఉన్నాడే..

ట్రైల‌ర్ టాక్ః నాని ఇంకోటి కొట్టేలా ఉన్నాడే..‘ఎవ‌డే సుబ్ర‌మణ్యం’తో మొద‌లుపెట్టి ‘జెంటిల్‌మ‌న్’ వ‌ర‌కు ఏడాదిన్న‌ర లోపే నాలుగు హిట్లు కొట్టేశాడు నేచుర‌ల్ స్టార్ నాని. ఇప్పుడు నాని కొత్త సినిమా ‘మ‌జ్ను’ ట్రైల‌ర్ చూస్తుంటే అత‌ను వ‌రుస‌గా ఐదో హిట్టు కొట్టేస్తాడేమో అనిపిస్తోంది. ట్రైల‌ర్ అంత ప్లెజెంట్‌గా.. ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది మ‌రి. య‌ధావిధిగా నాని పెర్ఫామెన్సే సినిమాకు హైలైట్ అయ్యేలా క‌నిపిస్తోంది. న‌ట‌న‌లో.. డైలాగ్ డెలివ‌రీలో త‌న‌దైన టైమింగ్ చూపిస్తూ ఎంట‌ర్టైన్ చేయ‌డానికి నాని త‌న‌వంతు ప్ర‌య‌త్న‌మే చేసిన‌ట్లున్నాడు. అత‌డి పాత్ర‌ను ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ స‌ర‌దాగా తీర్చిదిద్దిన‌ట్లున్నాడు.

‘‘మ‌నం లైఫ్‌లో చాలామందిని క‌లుస్తాం.. ఎప్పుడో ఎక్క‌డో ఒక‌ళ్లు క‌నెక్ట‌వుతారు. కానీ నా ద‌రిద్రం కొద్దీ ఒక‌ళ్ల‌కిద్ద‌రు క‌నెక్ట‌య్యారు’’.. ఈ ఫ‌న్నీ డైలాగ్‌తో మొద‌ల‌య్యే ట్రైల‌ర్ స‌ర‌దాగా సాగిపోయింది. ఒక‌బ్బాయి ఇద్ద‌ర‌మ్మాయిల్ని ఫ్ల‌ర్ట్ చేసి.. వాళ్ల‌ను ప్రేమ‌లోకి దించి.. చివ‌రికి ఇద్ద‌రికీ దూర‌మై ఇబ్బంది ప‌డే క‌థాంశంలా అనిపిస్తోంది ‘మ‌జ్ను’ మూవీ. ‘‘నీ ప్రేమ‌లో చాలా ర‌సాలున్నాయి భ‌య్యా.. మ‌రి ప్రేమ’’ అంటూ వెన్నెల కిషోర్ అడ‌గ‌డం.. ‘‘ప్రేమ ర‌సం కాదు భ‌య్యా చ‌ట్నీ’’ అని నాని అన‌డం బాగుంది. చివ‌ర్లో సినిమా క‌మింగ్ సూన్ అనడానికి సూచిక‌గా పెట్టిన డైలాగ్ కూడా ఫ‌న్నీగా ఉంది. మొత్తంగా ట్రైల‌ర్ చూస్తే నాని మ‌రో హిట్టు కొట్టేలాగే క‌నిపిస్తున్నాడు. జెమిని కిర‌ణ్ నిర్మించిన ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న కొత్త‌మ్మాయిలు అను ఇమ్మాన్యుయెల్.. ప్రియ‌శ్రీ న‌టించారు. గోపీసుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు