ఇదిగో తెలుగమ్మాయికి ఛాన్సిచ్చారు

ఇదిగో తెలుగమ్మాయికి ఛాన్సిచ్చారు

శోభిత ధూళిపాళ్ల.. బాలీవుడ్లో జయకేతనం ఎగురవేసిన తెలుగమ్మాయి. మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ సాధించడంతో పాటు మరి కొన్ని అందాల పోటీల్లోనూ సత్తా చాటుకుని.. అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన ఈ అమ్మాయిని మన ఫిలిం మేకర్స్ పట్టించుకోలేదు కానీ.. బాలీవుడ్లో మాత్రం ఈ గుంటూరు భామకు మంచి పేరే వచ్చింది. అనురాగ్ కశ్యప్ మూవీ ‘రమణ్ రాఘవ్ 2.0’లో కీలక పాత్రతో మొత్తం బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది శోభిత. ఆమెకు జాకీ ఛాన్ కొత్త సినిమాలోనూ ఛాన్స్ దొక్కొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. అది కన్ఫమ్ అయ్యేలోపు తన మాతృభాషలో ఓ అవకాశం దక్కించుకుంది శోభిత.

త్వరలోనే శోభిత తెలుగులోకి అరంగేట్రం చేయబోతోంది. ‘క్షణం’ తర్వాత అడివి శేష్ చేయబోయే కొత్త సినిమాలో శోభితనే హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. ముందు ఈ పాత్రకు ఆదా శర్మను అనుకున్నారు. ఆ తర్వాత రీతూ వర్మ లైన్లోకి వచ్చింది. ఇప్పుడు ఆమె కూడా పోయి శోభితకు ఛాన్స్ దక్కింది. ఈ చిత్రాన్ని రాహుల్ పాకాల.. శశికిరణ్ అనే ఇద్దరు కొత్త దర్శకులు రూపొందిస్తారు. శోభిత ఇంతకుముందే తెలుగులో సినిమా చేస్తుందని వార్తలొచ్చాయి కానీ.. అవి కార్యరూపం దాల్చలేదు. బాలీవుడ్లో పేరు తెచ్చుకున్నా.. తన మాతృభాషలో సినిమాలు చేయకపోవడంపై ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఫీలైంది శోభిత. తన టాలెంట్ తాను నిరూపించుకున్నానని.. ఇక అవకాశాలివ్వాల్సింది ఇక్కడి ఫిలిం మేకర్సే అని చెప్పింది. మొత్తానికి రచ్చ గెలిచిన పిల్ల ఎట్టకేలకు ఇంట గెలవడానికి వస్తోంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు