'జ్యో అచ్యుతానంద'లో ఒక సర్‌ప్రైజ్‌

'జ్యో అచ్యుతానంద'లో ఒక సర్‌ప్రైజ్‌

ఇంకో ఆరు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది 'జ్యో అచ్యుతానంద'. మంచి ఫీల్‌ గుడ్‌ ఎంటర్టైనర్లాగా.. చాలా ప్రామిసింగ్‌ గా అనిపిస్తోందీ సినిమా. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయం పాజిటివ్‌ గానే కనిపించింది. టీజర్‌.. ట్రైలర్‌.. ఆడియో అన్నీ కూడా పాజిటివ్‌ ఫీలింగే కలిగించాయి. అవ్వడానికి చిన్న సినిమానే కానీ.. అంచనాలు.. ఆసక్తి మాత్రం బాగానే ఉన్నాయి ఈ సినిమా మీద. నారా రోహిత్‌-నాగశౌర్య కాంబినేషన్‌ ఆసక్తి రేకెత్తిస్తుంటే.. రెజీనా పెరాామెేన్స్‌ విషయంలో కూడా జనాలకు మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ఈ సినిమాలో మరో సర్‌ప్రైజ్‌ ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి.

'జ్యో అచ్యుతానంద' దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌.. నిర్మాత సాయి కొర్రపాటిలకు అత్యంత సన్నిహితుడైన నాని ఈ సినిమాలో ఓ క్యామియో రోల్‌ చేస్తున్నట్లు సమాచారం. సినిమా చివర్లో నాని ఓ మెరుపు లాంటి పాత్రతో వచ్చి థ్రిల్‌ చేస్తాడని సమాచారం. నాని స్క్రీన్‌ ప్రెజెన్స్‌ భలేగా ఉంటుందని కూడా చెబుతున్నారు. 'జ్యో అచ్యుతానంద' ఆడియో వేడుకకు కూడా నాని రావడం.. ఈ సినిమా కథ తనకు తెలుసని.. కచ్చితంగా హిట్టవుతుందని చెబుతూ ముందే కంగ్రాట్స్‌ చెప్పడం గుర్తుండే ఉంటుంది. నాని నిజంగానే సినిమాలో ఉంటే.. అది కచ్చితంగా సినిమాకు ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ నెల 9న 'జ్యో అచ్యుతానంద' రిలీజవుతుండగా.. ముందు రోజు అమెరికాలో ప్రిమియర్లు కూడా గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు