ఆయనతో సినిమా చేయడం మాత్రం ఖాయం

ఆయనతో సినిమా చేయడం మాత్రం ఖాయం

ఎ.ఆర్.మురుగదాస్-ఆమిర్ ఖాన్‌లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. తాను తమిళంలో తీసిన ‘గజిని’ సినిమాను హిందీలో ఆమిర్ ఖాన్‌తో రీమేక్ చేసి సంచలనం సృష్టించాడు మురుగదాస్. అప్పట్లో ఆ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్ కలెక్షన్ల రికార్డుల్ని తిరగరాసింది. ఆమిర్ ఖాన్ కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచిపోయింది ‘గజిని’. దీని తర్వాత అక్షయ్ కుమార్‌తో మురుగదాస్ తీసిన ‘హాలిడే’ కూడా సూపర్ హిట్టే. దీంతో అతడికి మంచి గుడ్ విల్ వచ్చింది బాలీవుడ్లో. ఈ ఊపులో ఇప్పుడు ‘అకీరా’తో హ్యాట్రిక్ కొట్టేద్దామని చూస్తున్నాడు మురుగదాస్. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో మురుగ తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారమే విడుదలైంది. దాని రిజల్ట్ ఏంటో చూడాలి.

ఐతే బాలీవుడ్లో తన తర్వాత సినిమా ఆమిర్ ఖాన్‌తో ఉండొచ్చన్న సంకేతాలిస్తున్నాడు మురుగదాస్. ఈ మధ్యే ఆమిర్‌ను కలిసి సినిమా చేద్దామని అడిగానని.. అతను ఓకే చెప్పాడని మురుగదాస్ చెప్పాడు. ‘‘ఇటీవల ఆమిర్‌ను కలిశాను. ‘మన కాంబినేషన్‌లో సినిమా వచ్చి, చాలా ఏళ్లయింది. మళ్లీ చేద్దాం’ అన్నాను. ఆయన అంగీకరించారు. ప్రస్తుతం నేను దక్షిణాది చిత్రాలతో  బిజీ. హిందీ చిత్రాలతో ఆయన బిజీ. అందుకని ఇప్పటికిప్పుడు మా కాంబినేషన్‌లో సినిమాను మొదలుపెట్టలేం. కొంత సమయం పడుతుంది. ఎంత టైమయినా. ఆయనతో సినిమా చేయడం మాత్రం ఖాయం’’ అని మురుగదాస్ చెప్పాడు. ఆమిర్ తర్వాతి సినిమా ‘దంగల్’ కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని.. ఆ సినిమాలో ఆమిర్ లుక్ అద్భుతమని మురుగదాస్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు