శిరీష్ కోసం పవన్ కంటతడి

శిరీష్ కోసం పవన్ కంటతడి

యాక్సిడెంట్ అయి.. ఐసీయూలో చేరితే ఎవరికైనా బాధేస్తుంది. కానీ తనకు మాత్రం ఆ రోజు చాలా సంతోషం కలిగిందని చెబుతున్నాడు అల్లు శిరీష్. ఈ సంతోషానికి కారణం తన మావయ్య పవన్ కళ్యాణే అని చెబుతున్నాడు. 2007లో తనకు యాక్సిడెంట్ అయినపుడు పవన్ స్పందించిన తీరును ఎప్పటికీ మరిచిపోలేనని అంటున్నాడు శిరీష్. ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు శిరీష్.

‘‘2007లో నా కారుకు యాక్సిడెంట్ అయింది. నన్ను ఐసీయూలో చేర్చారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నా కోసం వచ్చారు. నాతో అంతగా పరిచయం లేకున్నా హాస్పిటల్‌కు రావడమే కాదు.. నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేను. ఆ రోజు చాలా సంతోషం కలిగింది’’ అని చెప్పాడు శిరీష్. మామూలుగానే పవన్ కొంచెం సెన్సెటివ్ పర్సన్. అందుకే శిరీష్ విషయంలోనూ అలా స్పందించినట్లున్నాడు.

శిరీష్ అన్నయ్య పవన్ కళ్యాణ్‌కు యాంటీగా మారాడని ఫ్యాన్స్ అనుకుంటున్న సమయంలో శిరీష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించేవే. అల్లు అర్జున్ చేసిన ‘చెప్పను బ్రదర్’ అనే వ్యాఖ్యలు ఎంతటి సంచలనం రేపాయో.. ఆ తర్వాత ఎన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. శిరీస్ అవేమీ పట్టించుకోకుండా పవన్ గురించి పాజిటివ్‌గా మాట్లాడి.. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం విశేషమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు