కాజల్‌.. ఇలా రెచ్చిపోతోందేంటి

కాజల్‌.. ఇలా రెచ్చిపోతోందేంటి

పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది కాజల్‌ అగర్వాల్‌. పనిగట్టుకుని గ్లామర్‌ విందు చేయడం ఎప్పుడూ లేదు. కొంచెం గ్లామరస్‌గా కనిపించేది తప్ప.. క్లీవేజ్‌ షోలు చేయడం.. అందాలు ఇష్టానుసారం ఆరబోసేయడం ఎప్పుడూ లేదు. ఐతే ఈ మధ్య అమ్మడు రూటు మార్చినట్లుంది. ఒక్కసారిగా గ్లామర్‌ గేట్లు తెరిచేసి రెచ్చిపోతోంది.

'జనతా గ్యారేజ్‌' సినిమా హైలైట్ల గురించి చెప్పాల్సి వస్తే.. కాజల్‌ పాట గురించి తప్పకుండా ప్రస్తావిస్తున్నారు జనాలు. ఈ పాటలో అసలు ఎన్టీఆర్‌ అనేవాడు ఉన్నాడనే సంగతే జనాలు మరిచిపోయి కాజల్‌ మీదే ఫోకస్‌ అంతే పెట్టే స్థాయిలో రెచ్చిపోయిందామె. ఆరంభం నుంచి చివరిదాకా క్లీవేజ్‌ షో చేస్తూ.. రెచ్చగొట్టే డ్యాన్సులేస్తూ కుర్రాళ్ల మతి పోగొట్టేసింది కాజల్‌. వంగి వంగి ఆమె షోలు చేస్తుంటే కుర్రాళ్ల ఉత్సాహం ఎలా ఉంటుందో ఇక చెప్పేదేముంది?

ఓ వైపు 'జనతా గ్యారేజ్‌'లో కాజల్‌ పాట గురించి చర్చ జరుగుతున్న టైంలోనే.. ఆమె నటించిన తమిళ సినిమా 'కవలై వేండామ్‌'కు సంబంధించిన ఓ పాట వీడియోను రిలీజ్‌ చేశారు. ఇందులోనూ కాజల్‌ అలాగే రెచ్చిపోయింది. స్విమ్మింగ్‌ పూల్‌లో తడి అందాలతో రెచ్చగొడుతూ కనిపించింది. ఈ సినిమాకు సంబంధించి ఇంతకుముందు వచ్చిన పోస్టర్లలోనూ కాజల్‌ రెచ్చిపోయింది. బికినీలో అందాల ప్రదర్శన చేసింది. మొత్తానికి లేటు వయసులో కాజల్‌ ఇలా గ్లామర్‌ గేట్లు తెరిచేయడం విశేషమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు