సినిమాకు నెగెటివ్‌ ప్రచారం చేయడానికి 25 లక్షలు

సినిమాకు నెగెటివ్‌ ప్రచారం చేయడానికి 25 లక్షలు

కమల్‌ ఆర్‌.ఖాన్‌ అని ముంబయిలో ఒక జోకర్‌ ఉంటాడు. హిందీ సినిమాల గురించి.. నటీనటుల గురించి ఎప్పుడూ అవాకులు చెవాకులు పేలుతుంటాడు. ఎవరినో ఒకరిని కెలకడం.. వారితో తిట్టించుకోవడం.. ఇతడికి మహా సరదా. అలాగే కావాల్సినంత పబ్లిసిటీ పొందుతుంటాడు. ఇతగాడు సినిమాలకు వీడియో రివ్యూలు కూడా ఇస్తుంటాడు. ఐతే వివాదాల వల్లే ఇతను బాగానే పాపులారిటీ సంపాదించుకున్నాడు. కొన్ని లక్షల మంది ఇతణ్ని ఫాలో అవుతుంటారు. ఐతే తాజాగా ఈ కమల్‌ కోసం మరో కాంట్రవర్శీ వచ్చి పడింది. దీపావళికి విడుదల కాబోతున్న అజయ్‌ దేవగన్‌ కొత్త సినిమా 'శివాయ్‌'కు నెగెటివ్‌ ప్రచారం చేయడానికి ఇతను రూ.25 లక్షలు తీసుకున్నాడట.

అజయ్‌ దేవగన్‌ స్వయంగా ఈ ఆరోపణలు చేశాడు. కమల్‌ ఆర్‌.ఖాన్‌ ఈ విషయంపై మాట్లాడుతున్న ఆడియో క్లిప్‌ ఒకటి అజయ్‌ దేవగన్‌ రిలీజ్‌ చేశాడు. అక్టోబరు 28న 'శివాయ్‌'తో పాటుగా కరణ్‌ జోహార్‌ మూవీ 'యే దిల్‌ హై ముష్కిల్‌' రిలీజవుతోంది. కరణే కమల్‌తో ఈ పని చేయిస్తున్నాడేమో అన్న ఆరోపణలున్నాయి. అజయ్‌ కూడా ఆ రకంగానే మాట్లాడాడు. ''నేను 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాను. నా తండ్రి యాక్షన్‌ డైరెక్టర్‌ గా ఇక్కడే పనిచేశారు. అందుకే ఈ రంగంతో నాకు ఎంతో అనుబందం ఉంది. ఇలాంటి రంగంలో కమాల్‌ ఆర్‌ ఖాన్‌ లాంటి వాళ్లు చేస్తున్న పనులు నాకు ఎంతో బాధను కలిగిస్తున్నాయి. సినీ రంగానికి చెందిన వాళ్లే ఇండస్ట్రీ నాశనానికి సపోర్ట్‌ చేయడం బాధాకరం. ఈ విషయంలో కరణ్‌ జోహర్‌ ప్రమేయం ఉందా లేదా అన్న విషయం పై కూడా విచారణ జరగాలి'' అని అజయ్‌ దేవగన్‌ అన్నాడు. ఐతే అజయ్‌ తన గురించి ఆరోపణలు చేయడంపై కమల్‌.ఆర్‌.ఖాన్‌ చాలా హ్యాపీ అయిపోతున్నాడు. తనకు కావాల్సినంత పబ్లిసిటీ కల్పించినందుకు అతను థ్యాంక్స్‌ కూడా చెప్పాడు. వాళ్ల సినిమాను ఇబ్బంది పెట్టే లైసెన్స్‌ నాకు ఇచ్చినందుకు అజయ్‌ దేవగన్‌కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English