నితిన్ బండి పట్టాలు తప్పుతోందా!

నితిన్ బండి పట్టాలు తప్పుతోందా!

ఇష్క్ తర్వాత మాటి మాటికీ యాక్సిడెంట్లకు గురవుతోన్న నితిన్ కెరీర్ బండి పట్టాల మీదికి వచ్చింది. గుండె జారి గల్లంతయ్యిందే హిట్టుతో వాయువేగాన్ని పుంజుకుంది. ఈ స్పీడుని ఇలాగే కంటిన్యూ చేస్తే, నితిన్ కి తిరుగే ఉండదు. కానీ బండి మెల్లగా పట్టాలు తప్పుతోందోమోననే డౌటు వస్తోంది. దానికి కారణం అతడు రెడ్ సిగ్నల్ ఇవ్వాల్సిన వాళ్లకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే.

గౌతమ్ మీనన్ తో కొరియర్ బాయ్ కళ్యాణ్ చేస్తున్న నితిన్, సడెన్ గా పూరీతో కమిటయ్యాడు. హార్ట్ అటాక్ అంటూ పూరీ జగన్ మార్కు సినిమా చేయడానికి ఉత్సాహంగా సిగ్నలిచ్చాడు. అయితే పూరీ సంగతి తెలుసుగా! అతడు హిట్ ఇచ్చి చాలా కాలమయ్యింది. పెద్ద హీరోలతో సినిమాలు తీశాడన్న మాటే గానీ, పోకిరి అంత హిట్ అతడు ఆ తర్వాత చూడనే లేదు. మూస ధోరణిలో పోతూ ప్రేక్షకులకి పిచ్చెక్కిస్తున్నాడు. అతడు తనకు హిట్ ఇస్తాడని నితిన్ ఎలా నమ్మాడో మరి. పోనీ మంచి దర్శకుడే కాబట్టి నమ్మాడనుకుందాం. మరో ఫ్లాప్ దర్శకుడితో కూడా జత కట్టడానికి రెడీ అయ్యాడట. అతడు ఎవరో కాదు... ఏఎస్ రవికుమార్ చౌదరి. ఇతడు ఎవరికో కాదు... గతంలో నితిన్ కే 'ఆటాడిస్తా' సినిమాతో అట్టర్ ఫ్లాపును రుచి చూపించాడు. అయినా కూడా అతడితో సినిమా తీయడానికి నితిన్ రెడీ అవుతున్నాడని తెలిసింది.

ఇవన్నీ చూస్తుంటే అతడి బండి రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నట్టు డౌటు రావడం లేదూ! మనకొస్తే ఏం లాభం... నితిన్ కి రావాలి గానీ అంటారా! నిజమే. అతడికే రావాలి. రాకపోతే మళ్లీ అతడి కెరీర్ మళ్లీ ఇంతకుముందులా పరాజయాల బాట పట్టక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు