ఇదేం ట్విస్టు రజినీ సార్..?

ఇదేం ట్విస్టు రజినీ సార్..?

కబాలి సినిమా చూసి మన ప్రేక్షకుల్లో పా.రంజిత్‌ను తిట్టనివాడు లేడు. సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇంతకుముందు కూడా ఫ్లాపులున్నాయి కానీ.. వాటిలో ఆయన వరకు చాలా ఎనర్జిటిగ్గా కనిపించాడు. ఎంటర్టైన్ చేశాడు. కానీ ‘కబాలి’లో నీరసంగా కనిపించిన రజినీని చూసి అభిమానులు చాలా డిజప్పాయింట్ అయ్యారు. ట్రైలర్ చూసి ఏదో ఊహించుకుని సినిమాకు వెళ్తే.. అక్కడ బొమ్మ ఇంకోలా కనిపించింది. రజినీని ఇలా చూపించినందుకు అందరూ రంజిత్‌ను విమర్శించారు. రజినీ ఇచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడన్నారు. కానీ రజినీ మాత్రం అలా ఫీలైనట్లు లేడు. రంజిత్‌ తనను ‘కబాలి’లో బాగానే ప్రెజెంట్ చేశాడని ఫీలైనట్లున్నాడు. తనలోని ఆధ్యాత్మిక కోణానికి ‘కబాలి’ సరిగ్గా సరిపోయిందని ఫీలయ్యాడో ఏంటో మరి.

రంజిత్‌తో ‘కబాలి’ తర్వాత కూడా ఇంకో సినిమా చేయబోతున్నాడట రజిని. ‘రోబో-2’ తర్వాత ఆయన చేయబోయే సినిమా అదేనట. ఇదేదో రూమర్ కూడా కాదు. స్వయంగా రజినీ అల్లుడు ధనుషే ఈ విషయాన్ని వెల్లడించాడు. తొలిసారి తన మావయ్యతో తాను కొలాబరేట్ అవుతున్నట్లు ధనుష్ వెల్లడించాడు. తాను నిర్మించబోయే సినిమాలో రజినీ హీరోగా నటిస్తాడని.. ఆ చిత్రానికి పా.రంజితే దర్శకుడని తెలిపాడు ధనుష్. ‘రోబో-2’ తర్వాత ఆ సినిమా మొదలవుతుందని చెప్పాడు. దీంతో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రజినీ సినిమా చేస్తాడన్న ఊహాగానాలకు తెరపడ్డట్లే. ‘కబాలి’ సెట్స్ మీద ఉండగా.. రంజిత్‌తో సినిమా చేయాలని ఆశపడ్డ సూర్యతో పాటు ఇంకొందరు హీరోలు ప్రస్తుతం అతడికి ముఖం చాటేస్తుండగా.. రజినీ మాత్రం మరో ఛాన్స్ ఇవ్వాలనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English