మనమంతా దెబ్బ కొట్టినా అదే సాహసం

మనమంతా దెబ్బ కొట్టినా అదే సాహసం

తెలుగులో ప్రస్తుతం మంచి అభిరుచి ఉన్న నిర్మాతల్లో సాయి కొర్రపాటి పేరు ముందు చెప్పుకోవాలి. ‘ఈగ’ దగ్గర్నుంచి ‘మనమంతా’ వరకు ప్రతి సినిమాతోనూ తన అభిరుచిని చాటుకున్నాడు సాయి. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన, మంచి సినిమాలు అందించడానికే ప్రయత్నం చేస్తున్నాడాయన. ఐతే ఆయనకు కొంత కాలంగా కలిసి రావడం లేదు. వరుసగా సినిమాలన్నీ బోల్తా కొట్టేస్తున్నాయి.

‘తుంగభద్ర’ కెరీర్లోనే పెద్ద ఫ్లాప్ కాగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మనమంతా’ కూడా నిరాశ పరిచింది. ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి కానీ.. డబ్బులు రాలేదు. ‘మనమంతా’ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండటంతో.. అన్ని చోట్లా ఈ సినిమా సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు సాయి. నిజానికి ఈ సినిమాను కొనడానికి బయ్యర్లు ముందుకొచ్చినా.. వాళ్లు చెప్పిన రేటు నచ్చక ఆయనే సొంతంగా రిలీజ్ చేశారు. అందుకు మూల్యం చెల్లించుకోక తప్పలేదు. బయ్యర్లు ఇస్తానన్నంత కూడా రాలేదు. నష్టాలు మిగిలాయి.
ఐతే ‘మనమంతా’ అనుభవం తర్వాత కూడా సాయి కొర్రపాటి పంథా మారలేదు. తన కొత్త సినిమా ‘జ్యో అచ్యుతానంద’ను కూడా సొంతంగా రిలీజ్ చేయడానికే చూస్తున్నారు. ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. అవసరాల శ్రీనివాస్ ఇప్పటికే ఓ హిట్టు కొట్టడం.. ప్రోమోస్ అన్నీ
కూడా ఆసక్తికరంగా ఉండటంతో మంచి రేటు ఇవ్వడానికి బయ్యర్లు రెడీగా ఉన్నారు. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమాకు మంచి డిమాండుంది. అయినప్పటికీ సాయి లొంగలేదు. అమెరికాలో తన వారాహి ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా సొంతంగా సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనే రిలీజ్ చేస్తారట. మరి ఈసారి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English