చైతూ-సమంత ఓపెన్ అయిపోయారుగా..

చైతూ-సమంత ఓపెన్ అయిపోయారుగా..

‘అఆ’ సినిమా చూస్తుంటే.. ఎక్కడో షాపింగ్ చేస్తుంటే.. తమ ఇద్దరినీ చాటుగా.. మొబైల్ కెమెరాల్లో మసక మసక ఫొటోలు తీసుకుని జనాలు ఇబ్బంది పడుతున్నారని నాగచైతన్య-సమంత ఫీలైనట్లున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రముఖ పెళ్లి వేడుకకు జంటగా హాజరై.. ఫొటోలకు పోజులిచ్చేశారు. అది నాగార్జునకు అత్యంత సన్నిహితుడైన నిమ్మగడ్డ ప్రసాద్ కూతురి పెళ్లి కావడం విశేషం. ఈ వేడుకకు నాగ్ కుటుంబంతో కలిసి సమంత హాజరైంది. చైతూ-సమంత ఈ వేడుక అంతటా జంటగానే కనిపించారు. తమ బంధం విషయంలో ఫైనల్‌గా ఇలా ఓపెన్ అయిపోయారన్నమాట చైతూ-సమంత.

ఈ వేడుకలో నాగ్ కుటుంబ సభ్యులందరితోనూ కలివిడిగా కనిపించింది సమంత. ఆ వేడుకకే సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. చైతూ-సమంత జంట మీదే పెళ్లి వేడుకలో అందరి కళ్లూ నిలిచి ఉన్నాయి. నిన్ననే నాగార్జున.. సమంతను సచిన్ టెండూల్కర్‌కు పరిచయం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అంతలోనే నిమ్మగడ్డ ప్రసాద్ కూతురి పెళ్లికి ఆమెను తమ కుటుంబంతో పాటుగా తీసుకురావడం ద్వారా అతి త్వరలోనే తనతో చైతూ పెళ్లి జరగబోతోందని సంకేతాలిచ్చేశాడు నాగ్. డిసెంబర్లోనే ఈ పెళ్లికి ముహూర్తం చూసినట్లుగా వార్తలొస్తున్నాయి. త్వరలోనే నిశ్చితార్థం జరిగే అవకాశాలున్నాయి.