పైరసీ దెబ్బ 18000 కోట్లు..

పైరసీ దెబ్బ 18000 కోట్లు..

ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌, మల్లూవుడ్‌, శాండిల్‌ వుడ్‌.. ఇలా పదుల సంఖ్యలో వుడ్లున్నాయి. అన్ని ఇండస్ట్రీల్లోనూ సినిమాలు భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్నాయి. అన్ని ఇండస్ట్రీలు కలిపి ఏడాదికి ఎంత లేదన్నా 1000 సినిమాలు రూపొందిస్తున్నాయి. వీటి వల్ల ఇండస్ట్రీలో జరుగుతున్న బిజినెస్‌ దాదాపు 15000 కోట్లు. ఏ కార్పోరేట్‌ కంపెనీకి తీసుపోని ధీటైన బిజినెస్‌ సినిమా ఇండస్ట్రీ సొంతం. దర్శకుడు, నిర్మాత, రచయిత, ఎడిటర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌, కెమెరామెన్‌, లైట్‌ మెన్‌ నుంచి చివరికి థియేటర్స్‌ లో క్యాంటీన్‌ నడిపే వరకు ఎన్నో లక్షల మంది ఈ సినిమా ఇండస్ట్రీపై ఆధారపడి బతుకుతున్నారు.

ఇంత మందికి ఉపాధిగా నిలుస్తోన్న సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టి పీడిస్తోంది. ఈ మధ్యే కొన్ని దారుణమైన నిజాలు బయటికి వస్తున్నాయి. సినిమా బిజినెస్‌ 15000 కోట్లు అయితే.. దాన్ని పైరసీ చేసి దొంగలు సొమ్ము చేసుకునే మొత్తం మాత్రం 18000 కోట్లు అని అంచనా. రిలీజ్‌ కు ముందే సినిమాను నెట్‌ లో పెట్టేసి.. రిలీజ్‌ రోజు సాయంత్రమే అమ్మేసి.. రెండు మూడు రోజుల్లోనే సినిమాను పైరసీ చేసి.. ఇలా వివిధ మార్గాల్లో 18000 కోట్లు వెనకేసుకుంటున్నారు పైరసీ దారులు. అధికారకంగా సినిమాలు విడుదల చేసే వాళ్ళు కూడా ఇంతగా సంపాదించట్లేదు గానీ పైరసీలో మాత్రం ఇంతగా దోచేస్తున్నారు. మరో మూడేళ్లలో 20000 కోట్లకు చేరనుంది సినిమా బిజినెస్‌ ఇండియాలో. అప్పుడు పైరసీ 30000 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు