వావ్.. రజినీ తర్వాతి సినిమా అతడితోనా?

వావ్.. రజినీ తర్వాతి సినిమా అతడితోనా?

కోలీవుడ్లో ప్రస్తుతం నడుస్తున్న ఊహాగానాలు నిజమైతే.. ఓ సెన్సేషనల్ కాంబినేషన్‌ను తెరమీద చూడబోతున్నట్లే. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లు తీసే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తాడని చెన్నైలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ‘కబాలి’తో ప్రేక్షకుల్ని పలకరించిన రజినీకాంత్.. దీని తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘రోబో-2’ మీద దృష్టిపెట్టాడు. దీని షూటింగ్ పూర్తవడానికి ఇంకో పది నెలలైనా పట్టొచ్చు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.

దాని తర్వాత రజినీ ఏ సినిమా చేస్తాడనే విషయంలో ఇప్పటిదాకా ఏ చర్చా జరగలేదు. శంకర్ లాంటి దర్శకులు తప్ప గత కొన్నేళ్లలో మిగతా వాళ్లెవరూ రజినీని సరిగా డీల్ చేయలేకపోయారు. ఎన్నో ఆశలు రేపిన పా.రంజిత్‌ కూడా నిరాశే మిగిల్చాడు. మరి ‘రోబో-2’ తర్వాత రజినీని టేకప్ చేసేది ఎవరు అనుకుంటుండగా.. గౌతమ్ మీనన్ పేరు తెరమీదికి వచ్చింది.

ప్రస్తుతం గౌతమ్.. ధనుష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే తన మావయ్యతో సినిమా చేసే విషయమై గౌతమ్‌తో ధనుష్ డిస్కషన్స్ జరిపాడట. గౌతమ్ ఓ లైన్ చెప్పగా అది ధనుష్‌కు నచ్చి.. రజినీకి చెప్పాడని.. ఆయన ఓకే అన్నాడని కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు. ఇంకా అధికారిక సమాచారం ఏమీ రాలేదు కానీ.. సౌత్ ఇండియాలో మోస్ట్ స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్‌తో రజినీ సినిమా చేస్తే భలేగా ఉంటుందని అనుకుంటున్నారు జనాలు. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ నిజంగానే తెరమీదికి వస్తుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English