సుమంత్ సినిమా టైటిల్ మారింది

సుమంత్ సినిమా టైటిల్ మారింది

పడటం.. లేవడం.. కామన్ అయిపోయింది సుమంత్‌కు. ఒక సినిమా హిట్టయి అతను కాస్త పైకి లేవడం.. ఇంతలోనే రెండు మూడు సినిమాలు తేడా కొట్టి కింద పడటం.. మామూలైపోయింది. అందులోనూ ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోవడానికి సుమంత్‌కు చాలా టైమే పట్టింది. ఆ సినిమా తర్వాత బాగా గ్యాప్ తీసుకుని బాలీవుడ్ హిట్ మూవీ ‘విక్కీ డోనర్’ను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మల్లిక్ రామ్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమాను సుమంతే స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ చిత్రానికి ‘నారి నారి డోనారి’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు కొన్ని రోజుల కిందట వార్తలొచ్చాయి.

ఐతే ఇప్పుడు దానికంటే బెటర్ టైటిల్ తట్టడంతో ఆ పేరు మార్చేస్తున్నారు. ‘నరుడా డోనరుడా’ అనేది ఈ సినిమా కొత్త టైటిల్ అట. రెండు టైటిళ్లనూ పోల్చి చూస్తే రెండోదే బెటర్ అనిపిస్తోంది. ఇంతకీ ఈ డోనరుడా.. అనే పదమేంటి అన్న సందేహం రావచ్చు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో తెలిస్తే ఆ సందేహం తీరిపోతుంది. ఇది వీర్య దానం (స్పెర్మ్ డోనేషన్) నేపథ్యంలో సాగే సినిమా. సంతానం లేక బాధపడే వారి కోసం వీర్యం దానం చేస్తుంటాడు ఇందులో హీరో. ఆ నేపథ్యంలో చాలా సరదాగా సాగుతుంది సినిమా. బాలీవుడ్లో ‘విక్కీ డోనర్’ సెన్సేషనల్ హిట్టయింది. తెలుగులోనూ అలాగే ఆడేస్తుందని ఆశపడుతున్నాడు సుమంత్. ఈ చిత్రంలో సుమంత్ సరసన హిందీ సీరియల్ నటి పల్లవి సుభాష్ నటిస్తోంది. అక్టోబర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English