అయ్యో అమలా.. అదీ చేజారిందా?

అయ్యో అమలా.. అదీ చేజారిందా?

అమలా పాల్ సినిమాల్లో కొనసాగాలని పట్టుబట్టడమే ఆమె విడాకులకు దారి తీసిందని మొదట్నుంచి అందరూ నమ్ముతున్న సంగతి. ఆ నమ్మకమే నిజమని ఆమె మావయ్య కూడా తేల్చేశాడు. తమ అభీష్టానికి వ్యతిరేకంగా ఆమె సినిమాల్లో నటించడం వల్లే వ్యవహారం విడాకుల వరకు వచ్చిందని ఆయనన్నాడు. ఆ తర్వాత ఎ.ఎల్.విజయ్ వచ్చి డ్యామేజ్ కంట్రోల్ మాటలు ఎన్ని చెప్పినా.. ఇప్పటికే ఇదే అమల-విజయ్ విడాకులకు ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. కనీసం భరణం కూడా అడక్కుండా అమల విడాకులకు అప్లై చేసిందంటే.. ఆమెకు సినిమాల మీద ఉన్న ఆసక్తి.. దాని ద్వారా వచ్చే ఆదాయం మీద భరోసా ఉండటం వల్లే కావచ్చు.

ఐతే విజయ్ నుంచి విడిపోవడం వరకు బాగానే ఉంది కానీ.. అమల ఆశించిన స్థాయిలో తన కెరీర్ ఉంటుందా అన్నదే సందేహంగా మారింది. ఆల్రెడీ అమ్మ పాత్రల్లోకి మారిపోవడంతో ఆమె గ్లామర్ ఇమేజ్ దెబ్బ తింది. పైగా ధనుష్-వెట్రిమారన్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఆమెకు వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందన్నది ప్రస్తుతం కోలీవుడ్లో వినిపిస్తున్న కబురు. ‘వాడా చెన్నై’ పేరుతో మూడు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాకు ముందుగా సమంతను హీరోయిన్‌గా అనుకున్నారు. అనివార్య కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో అమలకు అవకాశమిచ్చారు. కానీ ఇప్పుడు కారణమేంటో తెలియదు కానీ.. ఆ సినిమా నుంచి అమలను తప్పించేసినట్లు చెబుతోంది. అమల ఈ సినిమాపై చాలా ఆశలుపెట్టుకుంది. దీని ద్వారా మరిన్ని అవకాశాలు వస్తాయని.. ఇంకో నాలుగైదేళ్ల పాటు కెరీర్ పొడిగించుకోవచ్చని ఆశపడింది. కానీ ఆ సినిమా చేజారేలా ఉండటంతో అమల కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. అటు వివాహ బంధమూ దెబ్బతిని.. ఇటు సినీ కెరీరూ తేడా కొడితే అమల పరిస్థితేంటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు