చార్మినార్లో చెడ్డీల‌మ్మిన హీరోగారు

చార్మినార్లో చెడ్డీల‌మ్మిన హీరోగారు

పుర్రెకో బుద్ధి.. జిహ్వ‌కో రుచి అంటారు. సినిమా ప్ర‌మోష‌న్ల విష‌యంలోనూ మ‌న సెల‌బ్రెటీల తీరు ఇలాగే ఉంది. అంద‌రు న‌డిచే బాట‌లో న‌డ‌వ‌కుండా ఏదైనా భిన్నంగా చేయాల‌ని.. జ‌నాల దృష్టిని ఆక‌ర్షించాల‌ని మ‌న సినీ తార‌లు సినిమా ప్ర‌మోష‌న్ల‌కు కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఈ విష‌యంలో అమీర్ ఖాన్ ను స్ఫూర్తిగా తీసుకుని ఓ వినూత్న ఆలోచ‌న చేశాడు బాలీవుడ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ న‌వాజుద్దీన్ సిద్ధిఖీ.

త‌న కొత్త సినిమా ‘ఫ్రీకీ అలీ’ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా అతను చార్మినార్ ద‌గ్గ‌ర చెడ్డీల‌మ్మ‌డం విశేషం. ఈ సినిమాలో న‌వాజుద్దీన్ ది చెడ్డీల‌మ్మే పాత్రేన‌ట‌. అందుకే ప్ర‌మోష‌న్లోనూ అదే ప‌ని చేశాడు. ఈ చెడ్డీల‌మ్మే ప‌నిలో స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ కూడా పాల్గొన్నాడు. అత‌ను ఈ సినిమాలో మ‌రో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు స‌ల్మాన్ మ‌రో సోద‌రుడైన సోహైల్ ఖాన్ కావ‌డం విశేషం.

ఓ హాలీవుడ్ మూవీకి ఫ్రీమేక్ అని భావిస్తున్న ‘ఫ్రీకీ అలీ’ సెప్టెంబ‌రు 9న ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. రోడ్డు పక్కన చెడ్డీలమ్ముకుంటూ.. అప్పుడ‌ప్పుడూ రౌడీయిజం చేస్తూ బ‌తికే ఓ మామూలు వ్య‌క్తి అనుకోకుండా గోల్ఫ్ ఆడ‌టం.. అందులో ప్రావీణ్యం సాధించి.. గొప్ప స్థాయికి ఎద‌గ‌డం నేప‌థ్యంలో ఈ క‌థ సాగుతుంది. ఇందులో అమీ జాక్స‌న్ కూడా ఓ కీల‌క పాత్ర పోషించింది. స‌ల్మాన్ ఖాన్ సొంత సంస్థే ఈ చిత్రాన్ని నిర్మించ‌డం మ‌రో విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు