నట్టి కుమార్.. చెప్పు తెగుద్ది- కళ్యాణ్

నట్టి కుమార్.. చెప్పు తెగుద్ది- కళ్యాణ్

సి.కళ్యాణ్.. నట్టి కుమార్.. ఇద్దరూ ఇద్దరూ. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడే వాళ్లే. తరచుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకునే వీళ్లిద్దరి మధ్య ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ హత్య నేపథ్యంలో తీవ్ర స్థాయిలో మాటల దాడి జరుగుతోంది. మొన్న నట్టి కుమార్ మీడియా ముందుకొచ్చి సినీ పరిశ్రమలో చాలామందితో నయీంకు సంబంధాలున్నాయని ఆరోపిస్తూ.. మధ్యలో సి.కళ్యాణ్ పేరు తీసుకురావడం తెలిసిందే. ఈ ఆరోపణలపై సి.కళ్యాణ్ తీవ్ర పదజాలంతో ఎదురు దాడి చేశాడు. నట్టికుమార్.. చెప్పు తెగుద్ది అంటూ ఆయన హెచ్చరించడం గమనార్హం.

నట్టికుమార్‌ ఓ పిచ్చికుక్క అని.. అతని చరిత్ర అంతా బ్లాక్‌మెయిలింగేనని కళ్యాణ్ ఆరోపించాడు. నట్టికుమార్‌ చేష్టలు భరించలేక అతడిని విశాఖ నుంచి తరిమేశారని.. తెలుగు రాష్ట్రాల్లో నయీం కంటే నట్టికుమార్‌ బాధితులే ఎక్కువని కళ్యాణ్ అన్నాడు. అసలు ఈ నయీం ఎవరో తనకు తెలియదని సి. కళ్యాణ్‌ స్పష్టం చేశాడు. నయీంతో తనకు సంబంధాలున్నాయంటున్న నట్టికుమార్‌.. అందుకు తగ్గ ఆధారాలు ఉంటే బయటపెట్టాలని.. అంతే తప్ప అనవసరంగా మరోసారి నోరు జారితే చెప్పు తెగుద్దని.. తాటతీస్తానని కళ్యాణ్‌ గట్టి హెచ్చరిక జారీ చేశాడు. మరి నట్టి కుమార్ కూడా ఏం తగ్గే రకం కాదు కాబట్టి.. కళ్యాణ్ విమర్శలపై అతను కూడా ఇదే స్థాయిలో రెచ్చిపోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు