ఔను.. చైతూ కోసం నాగ్ దిగాడు

ఔను.. చైతూ కోసం నాగ్ దిగాడు

నాగచైతన్య కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘ప్రేమమ్’. చైతూ అంటే ప్రేమకథలకు పెట్టింది పేరు. అలాంటిది మలయాళ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప లవ్ స్టోరీగా నిలిచిపోయిన ‘ప్రేమమ్’ను తెలుగులో చైతూ హీరోగా తెరకెక్కిస్తుండటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. చైతూ కెరీర్‌కు ఈ సినిమా కీల‌కం కావ‌డంలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్స్ బాగానే జోడిస్తున్నారు.

ఇందులో చైతూ మావయ్య వెంకీ ఓ క్యామియో రోల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌నే కాక‌ చైతూ తండ్రి నాగ్ మాత్రం ‘ప్రేమమ్’లో తళుక్కుమంటున్నాడు.. ఈ రోజు ఆయన రోల్ కు సంబంధించి షూటింగ్ కూడా మొదలైంది. నాగ్ సినిమా చివ‌ర్లో వ‌చ్చి.. చైతూ త‌న కొడుకే అని చెప్పే సీన్ ఉంటుంద‌ట‌.ఇక వెంకీ మలయాళంలో రెంజి పానికర్ పోషించిన పాత్రలో క‌నిపిస్తాడ‌ట‌.. ఆ పాత్ర కనిపించేది ఐదు నిమిషాలే అయినా హిలేరియస్‌గా ఉంటుందంటున్నారు.

ఈ నెల 29న ‘ప్రేమమ్’ వీడియో సాంగ్ రిలీజ్ చేసి సెప్టెంబర్లో ఆడియో విడుద‌ల‌ చేసి.. అక్టోబరు 8న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్లాన్ చేస్తున్నారు. ‘కార్తికేయ’ ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English