శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు.. ఇప్పుడు రిలీజేంటి?

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు.. ఇప్పుడు రిలీజేంటి?

ఒక సినిమా విడుద‌లై బాగా ఆడేసి వెళ్లిపోయాక.. మ‌ళ్లీ గ్యాప్ ఇచ్చి రీ రిలీజ్ చేయ‌డం గ‌తంలో ఉండేది. కానీ ఇప్పుడు అలాంటివేమీ లేవు. ఒక‌సారి రిలీజై వెళ్లిపోతే అంతే సంగ‌తులు. జ‌నాల‌కు ఆస‌క్తి ఉంటే పైర‌సీ ట్రై చేసుకుంటారు త‌ప్పితే.. మ‌ళ్లీ థియేట‌ర్లో చూసుకోవ‌డానికి వీలుండ‌దు. ఐతే ‘శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు’ విష‌యంలో మాత్రం దీనికి భిన్నంగా జ‌రుగుతోంది.

విడుద‌లైన నాలుగో వారంలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు.. ఐతే అది తెలుగు రాష్ట్రాల్లో కాదు. అమెరికాలో. ఈ నెల ఐదో తారీఖున తెలుగు రాష్ట్రాల‌తో పాటు అమెరికాలోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు. ప్రిమియ‌ర్స్ కూడా వేశారు. ఐతే అప్పుడు పెద్ద‌గా రెస్పాన్స్ రాలేదు. అక్క‌డి ప్రేక్ష‌కులు ‘పెళ్లిచూపులు’ మాయ‌లో ఉండి.. ఈ సినిమాను ప‌ట్టించుకోలేదు. దీంతో అక్క‌డ ప్ర‌మోష‌న్ కూడా పెద్ద‌గా చేయ‌కుండా వ‌దిలేశారు.

ఐతే ఇప్పుడు అమెరికాలో పెళ్లిచూపులు జోరు త‌గ్గింది. సెప్టెంబ‌రు 1న జ‌న‌తా గ్యారేజ్ వ‌చ్చే వ‌ర‌కు అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు వేరే ఆల్ట‌ర్నేట్స్ లేవు. ఈ నేప‌థ్యంలోనే ‘శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు’ను 22 లొకేష‌న్ల‌లో రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మౌత్ టాక్ బాగానే ఉండ‌టంతో ఇప్పుడు క‌లెక్ష‌న్లు బాగా వ‌స్తాయ‌ని ఆశిస్తున్నాడు నిర్మాత అల్లు అర‌వింద్‌. మ‌రోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా నాలుగో వారంలోనూ చాలా థియేట‌ర్ల‌లో ఆడుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English