తారకరత్న.. రాజా మీరు కేక

తారకరత్న.. రాజా మీరు కేక

హీరోగా నిలదొక్కుకోవడానికి అవిశ్రాంతంగా పోరాడుతున్న నందమూరి తారకరత్న.. ఈ నెల ఆరంభంలో 'కాకతీయుడు' అనే సినిమాతో పలకరించాడు. ఆ సినిమా విడుదలైన రోజే వచ్చిన 'మనమంతా'లో చిన్న క్యామియో రోల్‌ చేశాడు. ఈ నెలలోనే అతడి మూడో సినిమా రాబోతోంది. తారకరత్న ప్రధాన పాత్ర పోషించిన 'ఎవరు' ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో తన కెరీర్‌ గురించి.. 'ఎవరు' గురించి.. దీని తర్వాత చేస్తున్న కొత్త సినిమా గురించి మాట్లాడాడు తారకరత్న. అతను 'రాజా మీరు కేక' అనే టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడట. ''ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తయ్యింది. రిలీజ్‌ ఎప్పుడు అనేది త్వరలో ప్రకటిస్తాను'' అని చెప్పాడు తారకరత్న.

''ఎవరులో జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాను. నేను ఇప్పటిదాకా పోషించిన పాత్రలన్నింటికీ ఇది చాలా భిన్నమైంది. నిజానికి ఈ సినిమాను అందరూ కొత్తవాళ్లతో తీయాలనుకున్నాడట దర్శకుడు రమణ సాల్వ. ఐతే మా నిర్మాత అంకం చౌదరి నాకీ కథ చెప్పడంతో బాగా నచ్చి ఓకే చెప్పాను. రవిబాబు తర్వాత నేను పని చేసిన దర్శకుల్లో బెస్ట్‌ ఎవరంటే రమణ పేరే చెబుతాను. అంతగా నన్నతను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి ముందు యామిని చంద్రశేఖర్‌ అనే పేరు పెట్టాం. కానీ ఆ టైటిల్‌ చూస్తే ఇదేదో ప్రేమకథ అనుకునే అవకాశముంది. అందుకే 'ఎవరు' అనే టైటిల్‌ మార్చాం. ఇదొక ఆసక్తికరమైన హార్రర్‌ థ్రిల్లర్‌. నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది'' అని తారకరత్న చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English