చరణ్‌ ఎక్స్‌ ప్రెస్‌ ఎక్కుతాడా..?

చరణ్‌ ఎక్స్‌ ప్రెస్‌ ఎక్కుతాడా..?

ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్‌ ఉంటుంది. కొందరు దర్శకులైతే కథ లేకపోయినా పర్లేదు గానీ సెంటిమెంట్‌ మాత్రం ఫాలో అవుతుంటారు. అచ్చంగా అలాంటి దర్శకుడే ఇప్పుడు రామ్‌ చరణ్‌ కు తగిలాడు. ఆ దర్శకుడు ప్రతీ సినిమాకు ఒకే సెంటిమెంట్‌ ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు చరణ్‌ అవకాశమిచ్చినా కూడా తన అలవాటు మాత్రం మార్చుకోనంటున్నాడు. ఆయన మరెవరో కాదు.. మేర్లపాక గాంధీ. వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌, ఎక్స్‌ ప్రెస్‌ రాజా సినిమాలతో సూపర్‌ హిట్లు కొట్టిన ఈ దర్శకుడు.. ఇప్పుడు హ్యాట్రిక్‌ మూవీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

ఈ సారి మాత్రం కాస్త గట్టి ఆఫర్‌ నే పట్టాడు గాంధీ. రామ్‌ చరణ్‌ లాంటి స్టార్‌ హీరోతో సినిమా చేసే అవకాశం గాంధీ ముందు నిలిచింది. శర్వానంద్‌ తో ఎక్స్‌ ప్రెస్‌ రాజా చేసిన మేర్లపాక గాంధీ.. ఇప్పుడు ఆయన సాయంతోనే రామ్‌ చరణ్‌ సినిమా పట్టేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే చరణ్‌ కు ఇండస్ట్రీలో బెస్ట్‌ ఫ్రెండ్‌ శర్వానే. గాంధీ రాసిన కథను రామ్‌ చరణ్‌ కు వినిపించేలా చేసింది శర్వానందే అనే వార్తలు వినిపిస్తున్నాయి. లవ్‌ స్టోరీగా తెరకెక్కబోయే ఈ చిత్రానికి మెగా ఎక్స్‌ ప్రెస్‌ టైటిల్‌ అనుకుంటున్నాడు గాంధీ. తొలి రెండు సినిమాల టైటిల్స్‌ లో ఎక్స్‌ ప్రెస్‌ పెట్టి సూపర్‌ హిట్స్‌ కొట్టేసిన గాంధీ.. మూడో సినిమాకు కూడా ఇదే రూట్‌ ఫాలో అవుతున్నాడు. మరి చరణ్‌ ఎక్స్‌ ప్రెస్‌ ఎక్కి ఎంతపెద్ద హిట్‌ కొడతాడో చూడాలి..!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English