సంజయ్‌ దత్‌కు నాన్నగా అమీర్‌ ఖాన్‌

సంజయ్‌ దత్‌కు నాన్నగా అమీర్‌ ఖాన్‌

హెడ్డింగ్‌ చూస్తే నమ్మబుద్ధి కావడం లేదు కదా. కానీ ఇదే నిజం. సంజయ్‌ దత్‌ తండ్రి సునీల్‌ దత్‌ పాత్రలో అమీర్‌ ఖాన్‌ నటించే అవకాశముంది. ఐతే సంజయ్‌ దత్‌ పాత్రలో మాత్రం సంజయ్‌ దత్‌ కనిపించడు. ఆ పాత్రకు రణబీర్‌ కపూర్‌ ఓకే అయిపోయాడు. సంజయ్‌ దత్‌ జీవిత కథతో గ్రేట్‌ డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ హిరాణీ ఓ సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో సంజయ్‌ దత్‌ తండ్రి సునీల్‌ దత్‌గా నటించమని అమీర్‌ ఖాన్‌ను హిరానీ అడిగాడట. అతను ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు కానీ.. దాదాపుగా ఓకే అన్నట్లే అని బాలీవుడ్లో చెప్పుకుంటున్నారు.

హిరానీకి సంజయ్‌ దత్‌, అమీర్‌ ఖాన్‌.. ఇద్దరితోనూ మంచి అనుబంధం ఉంది. సంజయ్‌ దత్‌తో మున్నాభాయ్‌ సిరీస్‌ సినిమాలు తీసిన హిరానీ.. అమీర్‌తో 3 ఇడియట్స్‌, పీకే లాంటి బ్లాక్‌ బస్టర్లు అందించాడు. దీని తర్వాత ఆయన సంజయ్‌ దత్‌ జీవిత కథతో సినిమా తీసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఏడాదిగా స్క్రిప్టు తీర్చిదిద్దుకునే పనిలోనే ఉన్నాడు హిరానీ. ఐతే ఇప్పటిదాకా తాను తీసిన సినిమాలతో ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తించిన హిరానీ.. కోర్టు కేసుల్లో నిందితుడిగా తేలి జైలు శిక్ష కూడా అనుభవించిన సంజయ్‌ దత్‌ కథ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడన్నది అర్థం కాని విషయం. తన మిత్రుడైన సంజయ్‌ను మంచిగా చూపించే ప్రయత్నం చేస్తే హిరానికి ఉన్న గొప్ప ఇమేజ్‌ దెబ్బ తినడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు