పవన్‌ ఫ్యాన్‌ హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌

పవన్‌ ఫ్యాన్‌ హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌

తీవ్ర సంచలనంగా మారిన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమాని హత్య కేసులో ప్రధాన నిందితుడైన అక్షయ్‌ కుమార్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన పవన్‌ అభిమాని వినోద్‌ రాయల్‌ ను హత్య చేయటం తెలిసిందే. హీరో గురించి జరిగిన చర్చ సందఠంగా మాటా మాటా పెరిగి.. ఘర్షణ చోటు చేసుకున్న అనంతరం వినోద్‌ రాయల్‌ ను ఏడుగురు కలిసి హత్య చేసినట్లుగా ఆరోపణ ఉంది.

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అక్షయ్‌ కుమార్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా సండూర్‌ తాలూకాలోని నర్సాపూర్‌ గ్రామంలోని నందిని దాబా వద్ద నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇద్దరు హీరో అభిమానుల మధ్య జరిగిన వాదులాట కాస్తా హత్య వరకూ వెళ్లటం తెలిసిందే. హత్యకు గురైన వినోద్‌ రాయల్‌ కుటుంబ సభ్యుల్ని గురువారం పవన్‌ కల్యాణ్‌ స్వయంగా వచ్చి ఓదార్చటం తెలిసిందే. ఈ సందఠంగా ఆయన మాట్లాడుతూ.. ఈ హత్యకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకునేంత వరకూ వదిలిపెట్టమంటూ ఆయన స్పష్టం చేయటం ఈ సందర్భంగా గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు