కొత్త అవతారంలో పెళ్లిచూపులు హీరో

కొత్త అవతారంలో పెళ్లిచూపులు హీరో‘పెళ్లిచూపులు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. చిన్న సినిమాల్లో ఇప్పుడతను పెద్ద హీరో. ఆల్రెడీ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇంకో రెండు మూడు కమిట్మెంట్లు కొత్తగా వచ్చాయి. వైజయంతీ మూవీస్.. సూపర్ గుడ్ ఫిలిమ్స్ లాంటి పెద్ద బేనర్లు అతడితో సినిమాలు చేస్తున్నాయి. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న విజయ్ సినిమాలకు మంచి క్రేజ్ వచ్చింది. మొన్నటిదాకా విజయ్ హీరోగా ‘ద్వారక’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతే జనాలకు పెద్దగా తెలియదు. ఇప్పుడా సినిమా గురించి జనాలు ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. ఇలాంటి టైంలోనే కృష్ణాష్టమిని పురస్కరించుకుని ‘ద్వారక’ ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు.

భజరే నందగోపాలా అంటూ ఓ శ్రావ్యమైన పాటతో ఈ టీజర్‌ను తీర్చిదిద్దింది ‘ద్వారక’ బృందం. విజయ్ కంప్లీట్ డిఫరెంట్ లుక్‌తో దర్శనమిస్తున్నాడు ఇందులో. బాగా గడ్డం పెంచాడు. అమాయకపు లుక్స్‌తో కనిపిస్తున్నాడు. ఈ మధ్యే ‘రైట్ రైట్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా జవేరి ఈ సినిమాలో కథనాయికగా నటిస్తోంది. టీజర్ చాలా కలర్ ఫుల్‌గానే తీర్చిదిద్దారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి.చౌదరి ఈ చిత్రాన్ని సమర్పిస్తుంటే.. ‘లెజెండ్ సినిమా’ బేనర్ మీద ప్ర‌ద్యుమ్న చంద్ర‌పాటి, గ‌ణేష్ పెనుబోతు నిర్మిస్తున్నారు. శ్రీనివాస ర‌వీంద్ర (ఎంఎస్ఆర్) అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. సాయికార్తీక్ సంగీత దర్శకుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు