చంద్రబాబు సెంటిమెంట్‌ - జనతా బ్లాక్‌బస్టరే

చంద్రబాబు సెంటిమెంట్‌ - జనతా బ్లాక్‌బస్టరే

సెంటిమెంట్‌ అంటే సాధారణ జనాలకి ఏమో కానీ, సినిమా వాళ్లకి మాత్రం ఎంతో ఇంపార్టెంట్‌! మూవీని సెట్స్‌ మీదకి ఎక్కించడం మొదలుకుని, మూవీ రిలీజ్‌ వరకు అంతా పక్కాగా సెంటిమంట్‌నే ఫాలో అవుతుంటారు. మంచి ముహూర్తం, మంచి సమయం చూసుకునే షూటింగ్‌ స్పాట్‌లో కొబ్బరికాయ కొడతారు. ఇక, రిలీజ్‌ టైంలో అమవాస్య ముందు అస్సలు రిలీజ్‌ చేయరు, అలాగే హీరోకి కలిసొచ్చిన వారం, వర్జ్యం, తారీకు, టైం ఇలా అన్నీ చూసుకుంటారు. అలా సెంటిమెంటల్‌గా మూవీలను రిలీజ్‌ చేయడం ద్వారా సూపర్‌, డూపర్‌ హిట్లు కొట్టొచ్చని అనుకుంటారు. అలా సెంటిమెంట్‌ ప్రకారం విడుదలైన రికార్డు బ్రేక్‌ చేసిన మూవీలు టాలీవుడ్‌లో అనేకం ఉన్నాయి.

నాగార్జున నటించిన అన్నమయ్య మూవీని శనివారం(వేంకటేశ్వరస్వామికి ఇష్టమైన రోజు) విడుదల చేశారు. ఆ సినిమా అన్ని చోట్లా సూపర్‌ హిట్టయింది. ఇక, ఇప్పడు తాజాగా బ్లాక్‌ బ్లస్టర్‌ అంచనాలతో విడుదలకు సిద్ధమైన తారక్‌ మూవీ జనతా గ్యారేజీకి కూడా సెంటిమెంట్లు సరిచూసుకుంటున్నారు. ఈ మూవీకి ఉన్న ప్రత్యేక సెంటిమెంట్‌ ఏంటంటే..  ఎన్టీఆర్‌ కెరీర్‌ లోనే అతి పెద్ద హిట్‌ గా నిలిచిన సింహాద్రి సినిమా రాజమౌళి దర్శకత్వం లో 2003 లో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా విడులయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉన్నారు..ఆ సినిమా విడుదలప్పుడే గోదావరి పుష్కారాలొచ్చాయి.

సరిగ్గా మళ్ళీ 12 ఏళ్లకు ఎన్టీఆర్‌ నటించిన జనతా గ్యారేజ్‌ సీఎంగా చంద్రబాబు ఉండగా రిలీజ్‌ అవుతోంది. ఈ సారి కృష్ణా పుష్కరాలు వచ్చాయి. ఈ సెంటిమెంట్‌ వర్క్‌ అవుట్‌ అయ్యి గ్యారేజ్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొడుతుందన్న టాక్‌ టాలీవుడ్‌లో వినిపిస్తోంది.  సో.. సెంటిమెంట్లకి ఒక పద్ధతి, పాడు ఉండదని అర్ధమైపోవట్లా..! ఏదేమైనా.. కొరటాల శివ డైరెక్షన్‌, ఎన్‌టీఆర్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో  అంచనాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఈ సెంటిమెంట్‌ క్లిక్కయి.. గ్యారేజ్‌ బ్లాక్‌ బ్లస్టర్‌గా నిలుస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు