గీతా ఆర్ట్స్ నేమ్ వెన‌క శిరీష్ చెప్పిన సీక్రెట్‌

గీతా ఆర్ట్స్ నేమ్ వెన‌క శిరీష్ చెప్పిన సీక్రెట్‌

మెగా ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ తొలి రెండు సినిమాల‌తో అంచ‌నాలు అందుకోలేక‌పోయాడు. ఇటీవల శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి హిట్ అందుకున్న శిరీష్ ఆ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు వ‌చ్చిన ఏ ఛాన్స్‌ను కూడా శిరీష్ అస్స‌లు వ‌దులుకోవ‌డం లేదు. మీడియాకు చాలా ఎక్కువ‌గా ఇంట‌ర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు.

 సోష‌ల్ మీడియాలో సైతం శిరీష్ ప‌లు విష‌యాల‌ను త‌న అభిమానుల‌తో షేర్ చేసుకుంటున్నాడు. గురువారం కృష్ణాష్టమి సందర్భంగా ఆసక్తికరమైన విష‌యాలు వెల్ల‌డించాడు. త‌న‌కు మంచి హిట్ ఇచ్చిన అభిమానుల‌కు కృష్ణాష్ట‌మి శుభాకాంక్ష‌లు చెప్పిన శిరీష్ మ‌న‌కు భ‌గ‌వ‌ద్గీత అందించిన కృష్ణుడుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేశాడు.

 ఇక త‌మ బ్యాన‌ర్ అయిన గీతా ఆర్ట్స్ నేమ్‌లో గీత అనే పేరు వెన‌క ఉన్న సీక్రెట్ కూడా చెప్పాడు. గీత అంటే చాలా మంది త‌మ అమ్మ అనుకుంటార‌ని...త‌మ అమ్మ పేరు నిర్మ‌ల అని...త‌న తండ్రి  భగవద్గీత ద్వారా ఎంతో ఇన్స్ పైర్ అయ్యారు, అందుకే మా బ్యానర్ కు గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టార‌ని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

 అది గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ నేమ్ వెన‌క ఉన్న అస‌లు సీక్రెట్‌. ఈ బ్యాన‌ర్‌ను అల్లు అర‌వింద్ తండ్రి అల్లు రామలింగ‌య్య 1972లో స్థాపించ‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించిన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English