పక్కోళ్లు కాదు.. నీ సంగతేంటి అఖిల్‌..

పక్కోళ్లు కాదు.. నీ సంగతేంటి అఖిల్‌..

త్యాగానికి కూడా ఓ హద్దుండాలి. ఇప్పుడు అఖిల్‌ చేస్తోన్న త్యాగాలకైతే హద్దే లేకుండా పోతోంది. లేకపోతే మరేంటి..  తన సినిమా గురించి ఆలోచించకుండా ఇప్పుడు పక్కోళ్ల సినిమాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు సిసింద్రీ. తొలి సినిమా విడుదలై ఏడాది గడుస్తోన్నా.. ఇప్పటికీ రెండో సినిమాపై క్లారిటీ ఇవ్వట్లేదు అఖిల్‌. తొలి సినిమా డిజాస్టర్‌ గా నిలవడంతో రెండో సినిమాతో ఎలాగైనా బ్లాక్‌ బస్టర్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు అక్కినేని వారబ్బాయి. ఇలాంటి టైమ్‌ లో తన సినిమా గురించి ఆలోచించకుండా.. సుశాంత్‌, నిత్యామీనన్‌ అంటూ పక్క వాళ్ల కోసం త్యాగాలు చేస్తున్నాడు అఖిల్‌.

ఆటాడుకుందాం రాలో సుశాంత్‌ కోసం కొన్ని సెకన్లు తెరపై కనిపించాడు అఖిల్‌. మేన బావ కోసం తన ఇమేజ్‌ ను పణంగా పెట్టాడు అఖిల్‌. ఇక ఇప్పుడు నిత్యామీనన్‌, దుల్కర్‌ సల్మాన్‌ కోసం మరో బాధ్యత నెత్తినేసుకున్నాడు సిసింద్రీ. వీళ్లిద్దరూ కలిసి నటించిన 100 డేస్‌ ఆఫ్‌ లవ్‌ తెలుగు వర్షన్‌ ఆగస్ట్‌ 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌ లో అఖిల్‌ కూడా పాల్గొంటున్నాడు. అది నిత్యామీనన్‌ కోసమా.. లేదంటే దుల్కర్‌ సల్మాన్‌ తో ఉన్న స్నేహమా అనేది తెలియదు గానీ అఖిల్‌ మాత్రం 100 రోజుల ప్రేమకు హెల్ప్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం పక్కోళ్ల కోసం త్యాగాలు చేస్తోన్న అఖిల్‌.. మరి తన కోసం ఎప్పుడు పాటు పడతాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు