ప‌ది కోట్ల‌కు ముంచిన క‌బాలి

ప‌ది కోట్ల‌కు ముంచిన క‌బాలి

గ‌త ఏడాది ‘బాహుబ‌లి’ త‌ర్వాత ఇండియా అంతా ఓ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూడ‌టం ‘క‌బాలి విష‌యంలోనే జ‌రిగింది. ముఖ్యంగా సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల ప్రేక్ష‌కులూ ‘క‌బాలి’ మేనియాతో ఊగిపోయారు. కానీ వారి ఉత్సాహం మీద నీళ్లు చ‌ల్లుతూ పా.రంజిత్ ఒక సాధార‌ణ‌మైన సినిమాను అందించాడు. ర‌జినీని అంత నీర‌స‌మైన పాత్ర‌లో చూసి అభిమానులు కంగుతిన్నారు. విడుద‌ల‌కు ముందు ఉన్న హైప్ వ‌ల్ల ఓపెనింగ్స్ అయితే వ‌చ్చాయి కానీ.. వీకెండ్ త‌ర్వాత సినిమా నిల‌బ‌డ‌లేదు. త‌మిళంలో అయినా సినిమా ఓ మోస్త‌రుగా ఆడింది కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వారాంతం త‌ర్వాత క‌లెక్ష‌న్లు దారుణంగా ప‌డిపోయాయి.

‘క‌బాలి’ వీకెండ్ వ‌సూళ్లు చూసి బ‌య్య‌ర్లు సేఫ్ జోన్లోకి వ‌స్తార‌నుకున్నారు కానీ.. అలాంటిదేమీ లేద‌ని తెలియడానికి ఎన్నో రోజులు ప‌ట్టలేదు. ర‌జినీ గ‌త సినిమాల‌తో పోలిస్తే మేలే కానీ.. ‘క‌బాలి’ వ‌ల్ల కూడా బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాలు త‌ప్ప‌లేదు. రూ.10 కోట్ల దాకా న‌ష్టాలు మిగిల్చిందీ సినిమా. ‘క‌బాలి’ సినిమాకు రూ.32 కోట్ల వ‌ర‌కు బిజినెస్ జ‌రిగితే.. వ‌సూలైన షేర్ 22 కోట్లు మాత్ర‌మే. నైజాంలో రూ.9.2 కోట్ల షేర్ వ‌సూలైంది. బ‌య్య‌ర్ కొంత వ‌ర‌కు సేఫే. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం న‌ష్టాలు ఎక్కువ‌గానే ఉన్నాయి. ఆంధ్రాలోని అన్ని ఏరియాలూ క‌లిపి రూ.9.5 కోట్లు వ‌సూల‌య్యాయి. రాయ‌ల‌సీమ‌లో రూ.3.25 కోట్లు వ‌చ్చాయి. సినిమాను ముందే అమ్మేసి నిర్మాత‌లు సేఫ్ అయిపోయారు కానీ.. బ‌య్య‌ర్లు.. థ‌ర్డ్ పార్టీ వ్య‌క్తులు మునిగారు.

Read More:


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు