నిర్మాత మీద తమన్నా సవారీ..

నిర్మాత మీద తమన్నా సవారీ..

సహ నటుడు.. పైగా నిర్మాత అదేమీ చూడకుండా తమన్నా.. సోనూ సూద్ వీపు మీద ఎలా కూర్చుందో చూడండి. ఆమె బరువు చాలదన్నట్లు ప్రభుదేవా నడుం మీద కూర్చున్నాడు. సోనూ అంత కష్టపడుతుంటే.. తమ్మూ-ప్రభు మాత్రం అసలేం పట్టనట్లు తమ పని తాము చూసుకుంటున్నారు. చూడ్డానికి భలే చిత్రంగా అనిపిస్తున్న ఈ ఫొటోను సోనూ సూదే ట్విట్టర్లో షేర్ చేశాడు. తన హోం ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న తొలి సినిమా ‘2 ఇన్ 1’ను ఆశీర్వదించాలని కోరాడు. ఈ సినిమా తెలుగులో ‘అభినేత్రి’ పేరుతో.. తమిళంలో ‘దేవి’ పేరుతో విడుదల కాబోతోంది. అక్టోబరు 7న అంటూ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేరు.

తమిళంలో ఈ చిత్రాన్ని ప్రభుదేవా నిర్మిస్తుంటే.. తెలుగులో కోన వెంకట్ నిర్మాత. హిందీ వెర్షన్ సోనూ సూద్ చేతికి వెళ్లింది. దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎ.ఎల్.విజయ్ నిర్మాత. తమ్మూ తొలిసారి దయ్యం పాత్ర చేయడమే కాదు.. ద్విపాత్రాభినయం కూడా చేస్తోంది ఈ సినిమాలో. ప్రభుదేవా ఆమె భర్తగా నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రభుదేవా.. తమన్నాల డ్యాన్సింగ్ టాలెంట్ చూపిస్తూ రిలీజ్ చేసిన రెండు టీజర్లూ ఆసక్తి రేకెత్తించాయి. ఆగస్టు 15న ఆడియో అన్నారు కానీ.. అనుకోకుండా వాయిదా పడింది సెప్టెంబర్లో అనుకున్న సినిమా కూడా అక్టోబరుకు వెళ్లింది. అమలాపాల్ తో విడాకుల వివాదంలో పడి కొన్ని రోజులు విజయ్ సినిమా పనులు పక్కనబెట్టడమే ఈ ఆలస్యానికి కారణమంటున్నారు. అక్టోబరు 7న మాత్రం సినిమా పక్కా అట.

More Articles:


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు