పరశురామ్‌ను పూరి బాగా తిట్టిపోసి..

పరశురామ్‌ను పూరి బాగా తిట్టిపోసి..

పరశురామ్.. పూరి జగన్నాథ్‌ శిష్యుడని అందరికీ తెలుసు. పూరి అన్నయ్య అని అతను సంబోధిస్తుంటే ప్రేమతో అలా అంటున్నాడేమో అనుకుంటూ ఉంటారంతా. కానీ నిజంగా పరశురామ్‌కు జగన్ అన్నయ్య అని చాలామందికి తెలియదు. పరశురామ్‌ పెదనాన్న కొడుకే పూరి. తాను సినిమాల్లోకి వచ్చే దిశగా పూరి తనను ఎలా ఇన్‌స్పైర్ చేసింది.. ఆయన దగ్గర పని చేసే అవకాశం ఎలా సంపాదించిందీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు పరశురామ్. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.

‘‘మాది విశాఖపట్నంలోని ఓ మారుమూల పల్లెటూరు. నేను ఎంబీఏ పూర్తి చేసిన టైంలో మా అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. ఆ సమయంలో ఊర్లోనే ఉంటే డిప్రెషన్లోకి వెళ్లిపోతాననే భయంతో ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని హైదరాబాద్ వచ్చాను. ఐతే అప్పుడే ‘ఇడియట్’ సినిమా రిలీజైంది. ఊళ్లో ఉన్నపుడు జగన్ అన్నయ్య దర్శకుడని తెలుసు కానీ.. ఆయన స్థాయేంటన్నది ఇక్కడికొచ్చాకే అర్థమైంది. నా కళ్ల ముందు తిరిగిన వ్యక్తి కష్టపడి ఈ స్థాయికి వచ్చినపుడు నేనెందుకు రాలేను అనిపించింది. సినీ రంగంలోకి వెళ్లాలన్న కోరిక పెరిగింది. ఆ సమయంలోనే జోగి నాయుడు ఏం చేసైనా పూరి దగ్గర అసిస్టెంటుగా చేరిపొమ్మన్నాడు. వెళ్లి అన్నయ్యకు విషయం చెబితే బాగా తిట్టిపోశాడు. ఎంబీయే చేశావు.. ఫారిన్ వెళ్తానన్నావ్.. మళ్లీ ఇదేంటి.. నేనే నిన్ను ఫారిన్ పంపిస్తా అన్నాడు. కానీ నేను మాత్రం అన్నయ్య దగ్గరే చేరతానని ఖరాఖండిగా చెప్పేశా. కొన్నాళ్లు కోపంతో నాతో మాట్లాడ్డం మానేశాడు. తర్వాత మా నాన్న ద్వారా అడిగిస్తే, కాదనేలక అసిస్టెంటుగా చేర్చుకున్నాడు. ఆంధ్రావాలా.. 143 సినిమాలకు ఆయన దగ్గర పని చేసి తర్వాత దశరథ్ దగ్గర చేరా. పరుగు సినిమాకు భాస్కర్ దగ్గరా పని చేశా. చివరికి యువత సినిమాతో దర్శకుడిగా మారాను’’ అని పరశురామ్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English