గోపీచంద్ మ‌రో డిజాస్ట‌ర్ త‌ప్పించుకున్నాడు

గోపీచంద్ మ‌రో డిజాస్ట‌ర్ త‌ప్పించుకున్నాడు

వ‌రుస‌గా ఐదారు ఫ్లాపుల త‌ర్వాత రెండేళ్ల కింద‌ట ‘లౌక్యం’తో మంచి విజ‌యాన్నందుకున్నాడు గోపీచంద్‌. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు నిల‌వ‌లేదు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘జిల్’ సినిమా చివ‌రికి ఫ్లాప్‌గా నిలిస్తే.. ‘సౌఖ్యం’ దారుణ‌మైన టాక్ తెచ్చుకుని డిజాస్ట‌ర్ అయింది. ఇప్పుడు అత‌డి ఆశ‌ల‌న్నీ ఎ.ఎం.ర‌త్నం త‌న‌యుడు జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ‘ఆక్సిజ‌న్’ మీదే ఉన్నాయి. ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో కానీ.. దీని కంటే ముందు గోపీచంద్ ద‌గ్గ‌రికి వ‌చ్చిన ఓ ప్రాజెక్టును ఒప్పుకుని ఉంటే మాత్రం మ‌రో డిజాస్ట‌ర్ ఖాతాలో వేసుకుని ఉండేవాడు.

ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చి పూర్తి నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ‘ఆటాడుకుందాం రా’ క‌థ ముందు గోపీచంద్ ద‌గ్గ‌రికే వ‌చ్చింది. దీని స్టోరీ రైట‌ర్ శ్రీధ‌ర్ సీపాన ముందు ఈ క‌థ‌ను గోపీకే చెప్పాడ‌ట‌. త‌నే ద‌ర్శ‌క‌త్వం కూడా చేద్దామ‌నుకున్నాడ‌ట‌. ఐతే అప్ప‌టికే శ్రీధ‌ర్ క‌థ‌తో ‘సౌఖ్యం’ చేసి చేదు అనుభ‌వాన్నెదుర్కొన్న గోపీచంద్.. ‘ఆటాడుకుందాం రా’ క‌థ‌కు నో చెప్పాడట‌. ఐతే కెరీర్లో ఇప్ప‌టిదాకా హిట్టు ముఖం చూడ‌ని సుశాంత్ కు మాత్రం ఈ క‌థ తెగ న‌చ్చేసింది. త‌న మార్కెట్ స్థాయికి మించి ఖ‌ర్చు పెట్టించి సినిమా చేశాడు.

ఇలా ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి రావ‌డం.. అది ఫ్లాప్ అయి ముందు కాద‌న్న హీరో కాల‌ర్ ఎగ‌రేయ‌డం మామూలే. ఈ ఏడాది  ఆరంభంలో వ‌చ్చిన ‘కృష్ణాష్ట‌మి’ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈ క‌థను అల్లు అర్జున్ తిర‌స్క‌రించాక సునీల్ ద‌గ్గ‌రికి వెళ్లింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు