బంగారం బాబుకు ఏం కలిసొస్తోందో...

బంగారం బాబుకు ఏం కలిసొస్తోందో...

కొన్ని మంచి సినిమాలు మంచి టైమింగ్‌లో విడుదల కాకపోవడం వల్ల దెబ్బయిపోతుంటాయి. ఇంకొన్ని సినిమాల్లో విషయం లేకపోయినా సరైన టైమింగ్‌లో రిలీజ్ కావడం వల్ల అంచనాల్ని మించి ఆడేస్తుంటాయి. ‘బాబు బంగారం’ రెండో కోవకే చెందుతుంది. ఈ సినిమాకు తొలి రోజు నెగెటివ్ టాక్ వచ్చింది. మౌత్ టాక్ అలాగే ఉంది. రివ్యూలూ అలాగే ఉన్నాయి. సినిమా నిలవడం కష్టం అన్నారు. కానీ పోటీగా విడుదలైన ‘తిక్క’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టడం.. పోటీలో ఇంకే పెద్ద సినిమా లేకపోవడం.. సోమవారం ఇండిపెండెన్స్ డే హాలిడే కూడా కలిసొచ్చి తొలి నాలుగు రోజుల్లో మంచి కలెక్షన్లు తెచ్చుకుంది ‘బాబు బంగారం’.

ఇక రెండో వారాంతంలో వచ్చిన రెండు సినిమాలపై అసలేమాత్రం హైప్ లేకపోగా.. అవి రెండూ కంప్లీట్ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఆ సినిమాల కంటే ‘బాబు బంగారం’కే ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయి. ఈ వారాంతంలోనూ వెంకీ-మారుతిల సినిమాకు కొన్ని చోట్ల ఫుల్స్ పడుతున్నాయి. పెద్ద సినిమా కావడం.. కొన్ని పాజిటివ్స్ ఉండటంతో జనాలకు ఇదే బెటర్ ఛాయిస్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.20 కోట్ల షేర్ మార్కును దాటేసినట్లు చెబుతున్నారు. వెంకీ కెరీర్లోనే ఇది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా అని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. మొత్తానికి బయ్యర్లకు భారీ నష్టాలు తెచ్చిపెడుతుందనుకున్న సినిమా ఎలాగోలా బాగానే నెట్టుకొచ్చేసి స్వల్ప నష్టాలతో బయటపడేసేలా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English