క్లియరెన్స్‌ సేల్‌ సినిమా

క్లియరెన్స్‌ సేల్‌ సినిమా

ఒకేసారి తొమ్మిది సినిమాలు మొదలుపెట్టిన సంచలనం సృష్టించిన హీరో నందమూరి తారకరత్న. చివరికి అలా ప్రారంభోత్సవం జరుపుకున్న సినిమాల్లో సగం విడుదలకే నోచుకోలేదు. విడుదలైన వాటి పరిస్థితేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పుష్కరం నుంచి హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు కానీ.. ఫలితం లేదు. ఎన్ని ఫ్లాపులొస్తున్నా అతడికి సినిమాలైతే వస్తున్నాయి. పూర్తవుతున్నాయి. ఏదో క్లియరెన్స్‌ సేల్‌లో పంపించేస్తున్నట్లు ఆ సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. అవి వస్తున్న సంగతి తెలియట్లేదు. వెళ్తున్న సంగతి తెలియట్లేదు. ఈ నెల మొదటి వారంలో ‘కాకతీయుడు’ అనే సినిమాను అలాగే క్లియర్ చేశారు.

ఇప్పుడు తారకరత్న ఇంకో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరు.. ఎవరు. ఇదొక హార్రర్ థ్రిల్లర్. తారకరత్నతో పాటు శేఖర్, యామిని, చందు ముఖ్య పాత్రలు పోషించారు. రమణ సెల్వ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ముప్ప అంకమ్మ చౌదరి నిర్మించారు. ఈ నెల 26న ఈ సినిమాను విడుదల చేస్తారట. తారకరత్న బంధువైన నారా రోహిత్ ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరించి.. సినిమాను ప్రమోట్ చేశాడు. హీరోగా అయితే తారకరత్నకు ఈ నెలలో ఇది మూడో సినిమా. నటుడిగా అయితే మూడో సినిమా. అతను ‘మనమంతా’లో కూడా చిన్న క్యామియో రోల్ చేశాడు. ఆ సినిమా సంగతలా వదిలేస్తే ‘కాకతీయుడు’ అసలు విడుదలైందో లేదో కూడా పట్టించుకునే స్థితిలో జనాలు లేరు. మరి ‘ఎవరు’ విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం.

More:

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English