భలేభలే.. మారుతి బాబును ఉపయోగించుకోలేదు

భలేభలే.. మారుతి  బాబును ఉపయోగించుకోలేదు

బాబు బంగారం.. బొబ్బిలిరాజా ఈజ్‌ బ్యాక్‌.. అంటూ బాబు బంగారం సినిమాపై ఓ రేంజ్‌ లో హంగామా చేసారు. దాదాపు పదేళ్ల తర్వాత వెంకటేశ్‌ చేసిన ఫుల్‌ లెంత్‌ ఎంటర్‌ టైనర్‌ ఈ సినిమా. అయితే బయట చెప్పినంత మ్యాటర్‌ మాత్రం సినిమాలో కనిపించలేదు. వెంకటేశ్‌ ఇమేజ్‌ క్యాష్‌ చేసుకోవడంలో మారుతి విఫలమయ్యాడు. కామెడీకి వెంకీ పెట్టింది పేరు..సిచ్యువేషన్‌ ఇయ్యాలే గానీ చింపి అవతల పారేస్తాడు వెంకటేశ్‌. అలాంటి హీరోను చేతిలో ఉంచుకుని మారుతి ఏం చేయలేకపోయాడు.

భలేభలే మగాడివోయ్‌ లో సిచ్యువేషన్‌ కామెడీ ఉంటుంది.. కానీ బాబు బంగారంలో కథను ముందుకు లాగడానికి మధ్యలో కావాలని సీన్స్‌ ఇరికించాడు మారుతి. జబర్దస్థ్‌ బ్యాచ్‌ తో చేయించిన కామెడీ నవ్వించకపోగా.. చిరాకు తెప్పించింది. అక్కడక్కడా సీన్స్‌ బాగానే అనిపించినా.. ఓవరాల్‌ గా మాత్రం వెంకటేశ్‌ కు ఈ బంగారం తలబొప్పి గట్టించాడు. సినిమాను దాదాపు 28 కోట్లకు బిజినెస్‌ చేసారు. తొలిరోజు 6 కోట్లకు పైగా వసూలు చేసాడు బంగారం.. ఆ తర్వాత రెండ్రోజులు కూడా ఓకే అనిపించాడు. సోమవారం కూడా సెలవు కావడం కలిసొచ్చే అంశం. ఇన్ని ఉన్నా.. బంగారం బయ్యర్లను ఒడ్డున పడేస్తాడా అంటే అనుమానమే. ఓవర్సీస్‌, ఇండియా కలిపి మూడు రోజుల్లో 15 కోట్లు వసూలు చేసాడు బాబు బంగారం. ఇక చివరి వరకు ఈ గోల్డ్‌ బాబు ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English