పవన్‌కు సమంత ధైర్యం చెప్పిన వేళ..

పవన్‌కు సమంత ధైర్యం చెప్పిన వేళ..

సమంత ఏంటి.. పనవ్‌ కళ్యాణ్‌కు ధైర్యం చెప్పడం ఏంటి అంటారా..? అక్కడే ఉంది విశేషం. పవన్‌ కొంచెం సిగ్గెక్కువ అన్న సంగతి తెలిసిందే. తనకు జనాల మధ్య నటించడం కానీ.. డ్యాన్సులేయడం కానీ చాలా ఇబ్బందని.. ఆ విషయంలో చాలాసార్లు సతమతమయ్యానని పవన్‌ చాలాసార్లు చెప్పడం గుర్తుండే ఉంటుంది. 'అత్తారింటికి దారేది' షూటింగ్‌ సందర్భంగా తనతో కలిసి డ్యాన్స్‌ చేసేటపుడు కూడా ఓసారి పవన్‌ ఇలాగే ఇబ్బంది పడ్డాడని.. ఆ సమయంలో తనే ధైర్యం చెప్పి ఆయనతో స్టెప్పులేయించానని సమంత వెల్లడించింది.

''నేను చాలామంది స్టార్‌ హీరోలతో కలిసి సినిమాలు చేశాను. కానీ వారిలో పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేకం. పవన్‌కు లక్షలాది మంది అభిమానులున్నారు. ఆయనకున్న ఫాలోయింగ్‌ ఏంటో నాకు తెలుసు. కానీ సెట్లో చాలా పద్ధతిగా.. హుందాగా.. ఏమీ తెలియనట్లు ఉంటారు. పెద్ద స్టారై ఉండి కూడా అంత సామాన్యంగా ఉండటం ఆయనలో మాత్రమే చూశా. ఇక పవన్‌కు ఎంత సిగ్గో చెప్పడానికి ఓ ఉదాహరణ చెబుతా. ఓసారి స్విట్జర్లాండ్‌లో ఓ పాటు చేస్తున్నాం. అక్కడ జనాలు పెద్దగా లేరు. షూటింగ్‌ మధ్యలో కొందరు టూరిస్టులు అక్కడికి వచ్చారు. వాళ్లను చూసి పవన్‌ చాలా సిగ్గుపడిపోయారు. నేను స్టెప్పులేయలేనంటూ కారవాన్‌లో కూర్చుండిపోయారు. నేను వెళ్లి రండి సార్‌.. రండి సార్‌ అని బతిమాలాను. ఎంతమంది ఉన్నా మీరే స్టెప్‌ వేయగలరని ధైర్యం చెప్పా. అలా బలవంతం చేస్తే కానీ.. ఆయన బయటికి రాలేదు. ఆ సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేను'' అని సమంత చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు