అవును.. పవన్‌తో సినిమా చేస్తున్నా

అవును.. పవన్‌తో సినిమా చేస్తున్నా

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో 'ఖుషి' లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్టిచ్చాడు నిర్మాత ఎ.ఎం.రత్నం. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్లుగా కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఇంకో రెండు మూడు సినిమాలు మాత్రమే చేసి రాజకీయాల్లోకి వెళ్లిపోవాలని భావిస్తున్న పవన్‌.. రత్నంతో సినిమా చేస్తాడా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఐతే స్వయంగా రత్నమే పవన్‌తో సినిమాను కన్ఫమ్‌ చేశాడు. ''అవును.. కళ్యాణ్‌ గారితో సినిమా చేస్తున్నా. తమిళ దర్శకుడు నేసన్‌ను ఆయనతో కలిపించాను. 'హీ ఈజ్‌ నైస్‌' అని కళ్యాణ్‌ గారు అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తాను'' అని రత్నం ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

ఒకప్పుడు స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత కనుమరుగైపోవడం గురించి రత్నం స్పందిస్తూ.. బాయ్స్‌, ప్రేమికుల రోజు, నాయక్‌ సినిమాల వల్లే తాను డౌన్‌ అయిపోయినట్లు చెప్పారు. 'బాయ్స్‌' తమిళనాడులో తప్ప అన్నిచోట్ల హిట్టయిందని.. ఆ సినిమాలో కొన్ని సన్నివేశాల విషయంలో అనవసర రాద్దాంతం చేయడం వల్ల తమిళంలో సరిగా ఆడలేదని రత్నం తెలిపారు. 'ప్రేమికుల రోజు'కి కూడా డబ్బులు పోయాయని.. హిందీలో తీసిన 'నాయక్‌' అప్పటి మార్కెట్‌ సరిగా లేకపోవడం వల్ల ఆడలేదని.. ఈ మూడు సినిమాలకు అప్పట్లోనే రూ.65 కోట్లు పెట్టడం వల్ల తాను నష్టం చవిచూడాల్సి వచ్చిందని.. దెబ్బ మీద దెబ్బ తగలడంతో తేరుకోవడం కష్టమైందని ఆయన చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English